బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్నారు. వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీ హీరోగా మారిపోయారు. తన తోటి హీరోలు ఇప్పటికీ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తుంటే సల్మాన్ మాత్రం తన హీరోయిన్లకు ముద్దులు కూడా పెట్టడు.

సినిమాలో లిప్ లాక్ లు ఉండకూడదని సల్మాన్ ముందే దర్శకులకు చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయట. తన సినిమాలు కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూసే విధంగా ఉండాలని ఈ హీరో భావిస్తాడని ఆ కారణంగానే లిప్ లాస్ వంటి సన్నివేశాలకు ఛాన్స్ ఇవ్వడని చెబుతుంటారు.
అయితే ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న సల్మాన్ ఆన్ స్క్రీన్ లో హీరోయిన్లకు ఎందుకు ముద్దు పెట్టరనే విషయంపై ప్రస్తావించాల్సి వచ్చింది. దీనికి సమాధానంగా సల్లు భాయ్.. ఆన్ స్క్రీన్ అమ్మాయిలను ముద్దు పెట్టడం తనకు సౌకర్యంగా ఉండదని అన్నాడు.
సల్మాన్ సమాధానం విన్న అతడి తమ్ముడు అర్భాజ్ ఖాన్ వెంటనే ''అన్నయ్య ఆఫ్ స్క్రీన్ అమ్మాయిలకు చాలా ముద్దులు ఇస్తాడు.. దాన్నే స్క్రీన్ పై చేయడం ఆయనకిష్టం లేదని'' చమత్కరించాడు. దీంతో అక్కడున్న వారంతా నవ్వేశారు.