చిన్న సినిమాలకు కొత్తదనమే ప్రధాన ఆయుధం. సినిమా బడ్జెట్ స్టార్ క్యాస్టింగ్ వంటి విషయాలను పక్కనపెడితే సినిమా కథ కథనం ఎంత డిఫరెంట్ గా ఉందన్నదే ముఖ్యం. యువ హీరో విష్ణు  నుంచి గత కొంత కాలంగా అలాంటి కథలే ఎక్కువగా వస్తున్నాయి. యూత్ ని ఎట్రాక్ట్ చేసేలా ఉన్న సాఫ్ట్ కథలను వదలడంతో మనోడి స్టయిలే వేరు. 

ఇక ఇప్పుడు బ్రోచేవారెవరురా అనే మరో సినిమాతో ఎదో కొత్తగా చూపించాలని ట్రై చేస్తున్నట్లు అర్ధమవుతోంది. సినిమాకు సంబందించిన టీజర్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ పరవాలేదు అనిపించే విధంగా క్రేజ్ అందుకుంటోంది. నివేత పేతురేజ్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో సత్య దేవ్ - ప్రియదర్శి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. 

ఇక మెంటల్ మదిలో సినిమాకు దర్శకత్వం వహించిన వివేక్ ఆత్రేయ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. టీజర్ కోసం కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి.