Bro Prerelease Event: పవన్ కళ్యాణ్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్... నినాదాలతో వేదిక బద్దలు!
బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ ఇంకా రాలేదు. ఆయన కోసం అభిమానులు ఎదురుచుస్తున్నారు.

పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ బ్రో. ఈ సోషియో ఫాంటసీ సోషల్ డ్రామా విడుదలకు సిద్ధమైంది. జులై 28న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నేడు ప్రీ రిలీజ్ వేడుక ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో భారీగా వర్షాలు పడుతుండగా శిల్పకళా వేదికలో కొద్దిమంది అభిమానుల మధ్య వేడుక నిర్వహిస్తున్నారు.
బ్రో ప్రీ రిలీజ్ వేడుకకు సాయి ధరమ్ తేజ్ తో పాటు హీరోయిన్స్ ఊర్వశి రాతెలా, ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ, చిత్ర యూనిట్, అతిథులు హాజరయ్యారు. మెగా హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ ఇంకా రాలేదు. యాంకర్ సుమ అభిమానులకు సర్ది చెప్పలేకపోతున్నారు. నటులు,అతిథులు మాట్లాడుతున్నా ఫ్యాన్స్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా రావాలని కోరుకుంటున్నారు.
బ్రో మూవీ తమిళ చిత్రం వినోదయ సితం రీమేక్. ఒరిజినల్ కి దర్శకత్వం వహించిన సముద్ర ఖని తెలుగులో కూడా తెరకెక్కించారు. త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందించారు. కథలో కూడా మార్పులు చేసినట్లు సమాచారం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు. ఊర్వశి రాతెలా స్పెషల్ సాంగ్ చేశారు...