Asianet News TeluguAsianet News Telugu

'సీటీమార్' బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

2019 డిసెంబ‌రులో ఈ సినిమా మొద‌లెట్టారు. 2020 స‌మ్మ‌ర్ విడుద‌ల చేద్దాం అనుకున్నారు. స‌రిగ్గా లాక్ డైన్ వ‌చ్చింది. ఆ త‌ర‌వాత సెకండ్ వేవ్ మొద‌లైంది.  

Breakeven target locked for Gopichands Seetimaarr
Author
Hyderabad, First Published Sep 9, 2021, 10:21 AM IST

సింగిల్ స్క్రీన్లకు ప్రాణం పోసే సినిమా కోసం వెతుకుతున్నారు డిస్ట్రిబ్యూటర్స్,ఎగ్డిబిటర్స్. ఈ క్రమంలో  వాళ్లకు ఉత్సాహాన్ని ఇచ్చేలా ‘సీటీమార్’రిలీజ్ కు రెడీ అవుతోంది. యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన ఈ చిత్రంపై మాస్ ప్రేక్షకుల్లో మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. పూర్తి స్దాయి కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తున్న ఈ సినిమా  మాస్ ఆడియన్స్ కు మంచి విందు భోజనం అవుతుందంటున్నారు. సింగిల్ స్క్రీన్లకు సందడి తెచ్చేవి ఇలాంటి సినిమాలే అనటంలో సందేహం లేదు. ఈ సినిమాపై ఎగ్జిబిటర్లు చాలా ఆశలతో ఉన్నారు.  ఈక్రమంలో ఈ సినిమా బిజినెస్ ఎంత జరిగింది....బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనేది చూద్దాం.

గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో 'సీటీమార్' సినిమా రూపొందింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా, 'వినాయక చవితి' పండగ సందర్భంగా ఈ నెల 10వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఓ రేంజిలో ప్రమోషన్స్ చేసారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగా జరిగింది. ఈ నేపధ్యంలో సినిమాకు డీసెంట్ గా బిజినెస్ జరిగింది. అందుతున్న సమాచారం మేరకు 11.5 కోట్లకు థియోటర్ రైట్స్ అమ్మారు. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్లు రావాలి. మంచి ఓపినింగ్స్ ,టాక్ వస్తే 12 కోట్లు రావటం కష్టమైన పనేమీ కాదు. అలాగే ఈ చిత్రం తెలంగాణాలో 214 థియోటర్స్ లో , ఆంధ్రాలో 350 థియోటర్స్ లో రిలీజ్ అవుతోంది. టోటల్ గా 565 థియోటర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదల అవుతోంది.

2019 డిసెంబ‌రులో ఈ సినిమా మొద‌లెట్టారు. 2020 స‌మ్మ‌ర్ విడుద‌ల చేద్దాం అనుకున్నారు. స‌రిగ్గా లాక్ డైన్ వ‌చ్చింది. ఆ త‌ర‌వాత సెకండ్ వేవ్ మొద‌లైంది. అన్ని సినిమాల‌తో పాటుగా మా సినిమా కూడా ఆల‌స్య‌మైంది. అయితే… ఆ ప్ర‌భావం ఈ సినిమాపై ఏమాత్రం ఉండ‌దు అని నిర్మాతలు చెప్తున్నారు.
 
ఇప్పటికే విడుదలైన  టీజర్, ట్రైలర్లు చూస్తే కమర్షియల్ అంశాలకు ఢోకా లేదని అర్థమవుతోంది. వినాయక చవితి కానుకగా రిలీజవుతున్న ఈ చిత్రానికి బుకింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. 'గౌతమ్ నంద' తరువాత గోపీచంద్ - సంపత్ నంది కలిసి చేసిన సినిమా ఇది. మణిశర్మ సంగీతానికి ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి. తరుణ్ ఆరోరా .. రెహ్మాన్ .. రావు రమేశ్ .. భూమిక ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను చేశారు. కొంతకాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న గోపీచంద్ కి ఈ సినిమా ఆ ముచ్చట తీరుస్తుందేమో చూడాలి. ఈ వీకెండ్లో సింగిల్ స్క్రీన్ల దగ్గర పండుగ వాతావరణం కనిపిస్తుందన్న అంచనాతో ఉన్నారు నిర్మాతలు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios