Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.  నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఫిబ్రవరి 20వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం. 

ఈరోజు ఎపిసోడ్ లో యష్ వాష్ రూమ్ లో నుంచి బయటికి రావడంతో అప్పుడు వేద ఇదిగోండి ఈ టాబ్లెట్ వేసుకోండి అనడంతో వద్దు నాది అసలే స్టీల్ స్టమక్ అనడంతో అందుకే పంచర్ అయింది అని సెటైర్లు వస్తుంది వేద. అప్పుడు విన్నీ బయట అబ్బా అని అటు ఇటు కడుపు పట్టుకుని తిరుగుతుండగా వేద అది చూసి వేద నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు వేద టాబ్లెట్ ఇక్కడ పెడుతున్నాను కావాలంటే వేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు యష్ ఆ టాబ్లెట్ వేసుకుంటాడు. మరొకవైపు విన్నీ మోషన్స్ పెట్టుకోవడంతో కడుపు అంతా ఏదోలా అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి వేద వస్తుంది.

అప్పుడు వేద అక్కడ ఆయనకు ఇక్కడికి నీకు ఇద్దరికి స్టమక్ పంచర్ అయింది అనడంతో నాకేం లేదు వేద అని కవర్ ఇచ్చుకుంటూ ఉండగా నా దగ్గర అబద్ధాలు ఆడకు అని అంటుంది వేద. ఓహో తెలిసిపోయిందా అంటాడు విన్నీ. నువ్వు డాక్టర్ కదా ఏదైనా చెప్పొచ్చు కదా అనడంతో ఈ టాబ్లెట్ వేసుకో అని టాబ్లెట్ ఇస్తుంది వేద. అప్పుడు విన్నీ వేదు నా సిచువేషన్ గురించి నీకు ఎలా తెలిసింది నామీద ఎంత ప్రేమ నేను చాలా లక్కీ అనడంతో ఈ సిచువేషన్ లో కూడా జోకులు అవసరమా అక్కడ ఆయన పరిస్థితి చూశాక నీ పరిస్థితి కూడా అర్థం అయింది అందుకే టాబ్లెట్ తీసుకువచ్చాను అంటుంది వేద.

అయిన వేదు మీ ఆయన చాలా గ్రేట్ అనడంతో మామూలుగా పానకం తాగడు విన్ని కానీ నీ మీద పోటీకి తాగాడు ఇలా రివర్స్ అయ్యింది అనుకుంటూ ఉంటుంది. ఆయన పరిస్థితి పైన ఎలా ఉందో తెలియదు వెళ్లి చూడాలి. ఈ రాత్రికి బాత్రూంలోనే బెడ్ వేయాలేమో అనగా విన్నీ వేద ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. సరే విని వెళ్లొస్తాను అని వేద వెళుతుండగా ఇంతలో కరెంటు పోవడంతో వేద కాలికి ఏదో గుచ్చుకుంటుంది. అప్పుడు విన్నీ టెన్షన్ పడుతూ ఏమైంది లేదు అని అడగగా ఏమీ లేదు అని వేద కూర్చుంటుంది. మరోవైపు యష్ ఇదేంటి ఇప్పుడు కరెంటు పోయింది వేద ఏమో కిందికి వెళ్ళింది ఆమె మెట్లపై ఎలా వస్తుందో ఏమో అనుకుంటూ ఉంటాడు.

అయినా ఇదేంటి ఇప్పుడు కరెంటు పోయింది అని వేద అనగా నాకోసమే నేను అని అంటాడు విన్నీ. అప్పుడు సరే విన్నీ ఒక జోక్ చెప్పి నవ్వించు అనడంతో అప్పుడు విన్నీ జోక్ వేసి వేదని సరదాగా నవ్విస్తూ ఉంటాడు. అప్పుడు యష్ కరెంట్ అంతా పోయింది అని కిటికీ వైపు చూస్తూ ఉండగా కింద విన్నీ వేద మాట్లాడుకోవడం చూస్తాడు. మరోవైపు విన్నీ కానీ నువ్వు మాత్రం నన్ను చీపురులా తీసేశావు వేదు నువ్వంటే నాకు ఎంత ఇష్టం నువ్వంటే పడి చచ్చేంత ఇష్టం. ముందేమో ఆ మనోహర్ గాడిని ప్రేమించావు ఇప్పుడేమో యశోదర్ ని పెళ్లి చేసుకున్నావు.

నాకు ఒక్క ఫోన్ కొట్టింటే ప్రపంచంలో ఎక్కడ ఉన్న రెక్కలు కట్టుకొని నీ ముందు వాలిపోయే వాడిని అంటాడు విన్నీ. పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నేను నీకు గుర్తు రాలేదా లేదా అని విన్నీ అడగగా ఆ మాటలకు యష్ షాక్ అవుతాడు. అప్పుడు వేద నన్ను ఆట పెట్టించడం తప్ప వేరే పని తెలియదా అనడంతో నేను కాకపోతే నిన్ను ఎవరు ఆటపట్టిస్తారు అంటాడు విన్నీ. మరోవైపు చిత్ర చేతిలో ఉన్న గ్లాస్ కింది పడిపోవడంతో అప్పుడు చిత్ర వాటిని తొక్కుతుంది. ఇంతలో కాలికి బ్లడ్ రావడంతో వసంత్ అని గట్టిగా పిలుస్తుంది. అప్పుడు వసంత్ కట్టు కట్టి కాలికి ముద్దు పెడతాడు. మరోవైపు యష్ వేదకు అసలు బుద్ధి లేదు నన్ను విడిచిపెట్టి వాడి దగ్గరికి వెళ్లి కబుర్లు చెబుతోంది అనగా ఇంతలోనే అక్కడికి యష్ అంతరాత్మ వచ్చి చేస్తూ ఫన్నీగా మాట్లాడుతూ ఉంటుంది.

 అప్పుడు అంతరాత్మ యష్ కి అర్థమయ్యే విధంగా చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం చిత్ర ఆఫీసులో ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా ఇంతలోనే మా భ్రమరాంబిక అక్కడికి వచ్చి నీతో ఐదు నిమిషాలు మాట్లాడాలి అనడంతో మీటింగ్ మళ్లీ పెడదాం అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటాడు అభి. అప్పుడు అభి ఏంటి అక్క చెప్పేది మాళవిక నామీద కేసు వేయడం ఏంటి అనడంతో మీరు ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నారు అందుకే నీ ఆస్తిలో వాటా కావాలని కేసు వేసింది అంటుంది భ్రమరాంబిక. నువ్వు రేపు పెళ్లి చేసుకోకుండా వదిలేసావ్ అనుకో నీ ఆస్తులు సగం వాటా తనకి వెళ్తుంది అని అంటుంది భ్రమరాంబిక.

 అప్పుడు చిత్ర వారి దగ్గరికి వెళ్లి వారి మాటలు వింటూ ఉంటుంది. అప్పుడు అభి చిత్రని బయటకు వెళ్ళమని చెబుతాడు. అప్పుడు భ్రమరాంబిక అభి చేతికి ఒక ఫైల్ ఇచ్చి ఇందులో నువ్వు తన చేత సంతకం పెట్టించు అప్పుడు నువ్వు సేఫ్ ని ఆస్తి సేఫ్ అని చెబుతుంది. మరొకవైపు యష్ ఒకచోట కూర్చుని ఉండగా ఇంతలో రాజేశ్వరి అని ఒక ఆమె అక్కడికి వచ్చి నా కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నాను ఈ విషయంలో కాస్త హెల్ప్ చెయ్ అని అడుగుతుంది. అప్పుడు ఇదే మంచి అవకాశం ఆ వివిన్ గారికి పెళ్లి చేసి అమెరికాకు పంపించేయాలి అనుకుంటూ 
ఉంటాడు యష్.

 అతను ఒప్పుకుంటాడా అని అనడంతో మన వేద ఒప్పిస్తుంది మన వేద ఎంత చెప్తే అంత అని అంటాడు. అప్పుడు యష్ సంతోషంతో నాకు వదిలేయండి ఈ పెళ్లి అయిపోనట్టే అని అంటాడు. ఆ తర్వాత విన్నీ అక్కడికి రావడంతో యష్ సంతోషపడుతూ విన్నీ మీద లేని పోనీ ప్రేమలు ఒలకబోస్తూ ఉంటాడు. అసలు విశేషం ఏంటి అనగా అప్పుడు సులోచన అసలు విషయం చెప్పడంతో నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు కదా ఆంటీ అని అంటాడు. ఇంతలోనే అక్కడికి వేద వస్తుంది. అప్పుడు అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు..