గెలుపోటములతో సతమతవ్వడం సినిమా ఇండస్ట్రీలో ఉన్నట్లుగా ఇంకెక్కడా ఉండదేమో అనిపిస్తుంది. ప్రస్తుతం ఫ్యామిలీ కథలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల పరిస్థితి కూడా అలానే ఉంది. కొత్త బంగారు లోకం - సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో శ్రీకాంత్ రేంజ్ చాలా వరకు పెరిగింది. 

అయితే మహేష్ అతన్ని నమ్మి బ్రహ్మోత్సవం సినిమా చేశాడు. ఆ సినిమా ఏ స్థాయిలో డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తరువాత శ్రీకాంత్ అడ్డాలతో సినిమా చేయాలనీ అనుకున్న హీరోలు సైతం బ్రహ్మోత్సవం ఇచ్చిన రిజల్ట్ కి మళ్ళీ ఆ దర్శకుడిని చూడలేదు. నిర్మాతలు కూడా శ్రీకాంత్ కథలను వినడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. 

అయితే ఫైనల్ గా అల్లు అరవింద్ ఒక అవకాశం ఇచ్చారు. దీంతో తాను రాసుకున్న కథలో మార్పులు చేసుకుంటూ ఇన్నేళ్లు కష్టపడ్డాడు.కానీ శ్రీకాంత్ అడ్డాల కథ మళ్ళీ మొదటికొచ్చినట్లు తెలుస్తోంది. బడా నిర్మాత అండ ఉన్నప్పటికీ స్టార్ హీరోలు అడ్డాలతో వర్క చేయడానికి ఒప్పుకోవడం లేదట.దీంతో శర్వా - రాజ్ తరుణ్ లాంటి హీరోలతో చేయాలనీ అల్లు అరవింద ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి శ్రీకాంత్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.