Asianet News TeluguAsianet News Telugu

రిలీజ్ కు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తోన్న బ్రహ్మాస్త్ర, ఆసక్తికరంగా మారిన సినిమా రిలీజ్

ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ సర్కిల్ లో బ్రహ్మస్త్ర ఫీవర్ నడుస్తోంది. ఈ సినిమా హిట్ అయితేనే.. కాస్త ఊపిరన్నా మిగులుతుంది బాలీవుడ్ సినిమాకు.. లేకుండా డ్యామేజ్ భారీగా జరిగే ప్రమాధం ఉంది. ఈ క్రమంలోనే సరికొత్త రికార్డ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది ఈ సినిమా. 
 

Brahmastra Movie Creates New Record Before Release
Author
First Published Sep 6, 2022, 12:59 PM IST


హింట్ అయితే సంబరాలు చేసుకుందామని కొందరు.. ప్లాప్ అయితే.. ఏకి పడేద్దామని మరికొందరు బ్రహ్మాస్త్ర రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు.  ప్ర‌స్తుతం ఇండియాలో  బ్రహ్మ‌స్త్ర  ట్రెండింగ్‌లో ఉంది. బాలీవుడ్ స్టార్ క‌పుల్ ర‌ణ్‌బీర్ సింగ్‌, అలియాభ‌ట్ లీడ్ రోల్స్ చేసిన ఈ సినిమా  అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కింది.  తెలుగులో బ్ర‌హ్మ‌స్త్రం పేరుతో ఈ సినిమా రిలీజ్ కబోతోంది. అయితే మూడు భాగాలుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈసినిమా మొదటి భాగాన్ని ఈ సెప్టెంబర్ 9న రిలీజ్ చేయబోతున్నారు. 

హిందీతో పాటు తెలుగు,తమిళ,కన్నడ,మలయాళ భాషల్లో కూడా ఈసినిమా రిలీజ్ కాబోతోంది. సౌత్ లో ఈసినిమాకు స్టార్ డైరెక్టర్ రాజమౌళి సమర్పకుడిగా ఉండటంతో.. ఈసినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అంతే కాదు.. ఇప్పటి వరకూ రిలీజ్ అయిన అప్ డేట్స్ తో పాటు.. ట్రైలర్ కూడా ఈసినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది.  కింగ్ నాగార్జున కీల‌క‌పాత్రలో న‌టించ‌డంతో తెలుగులో కూడా ఈ సినిమాపై విప‌రీత‌మైన బ‌జ్ ఉంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈమూవీ సక్సెస్ .. బాలీవుడ్ కు ఎంతో అవసరం.. అనేది మరో ఎత్తు. 

ఫాంట‌సీ అడ్వేంచ‌ర్ గా తెరకెక్కిన ఈసినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో.. మూవీ టీమ్ ప్రమోషన్స్ లో జోరు పెంచింది. వరుస ఈవెంట్స్ లో పాల్గోంటూ.. సినిమాపై హైప్ క్రియేట్‌చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. ఇప్ప‌టికే బ్రహ్మాస్త్ర కు  ప్రీ బుకింగ్స్ స్టార్ట్ అవగా.. భారీ స్థాయిలో టిక్కెట్స్ అమ్ముడు పోయిన‌ట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే కేవ‌లం ఒక్క  పివీఆర్ మ‌ల్టీప్లెక్స్‌ల‌లోనే ఈ సినిమాకు 1ల‌క్ష టిక్కెట్లు అమ్ముడు పోయాయట‌. ఈ మ‌ధ్య కాలంలో బాలీవుడ్‌లో ఏ సినిమాకు ఈ స్థాయిలో టిక్కెట్ బుకింగ్స్ జ‌రుగ‌లేద‌ు. 

 దీన్ని బ‌ట్టి చూస్తే బ్ర‌హ్మ‌స్త్ర  సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయి అనేది తెలుస్తోంది. ఈరకంగా చూస్తే..ఫస్ట్ డేనే ఈ సినిమా దాదాపు గా 30 నుండి 35 కోట్ల వ‌ర‌కు  క‌లెక్ష‌న్ల‌ు  సాధిస్తుంద‌ని సినీ జనాలు అంచనా వేస్తుననారు. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే బ్రహ్మాస్ర  8 కోట్ల వ‌ర‌కు గ్రాస్‌ను క‌లెక్ట్ చేసిందట‌.  తెలుగులో కూడా ఈ మూవీ స్పందన బాగానే ఉంటుంది సమాచారం. మూడు భాగాలుగా తెర‌కెక్క‌నుంది బ్ర‌హ్మ‌స్త్ర‌  మూవీ. అందులో ఫస్ట్ పార్ట్ ఇప్పుడు రిలీజ్ కాబోతోంది. ఈసినిమాను శివ పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. 

ఈ సినిమా హిట్ పై బాలీవుడ్  ఇమేజ్ ఆధారపడి ఉంది. ఇప్పటికే బాయ్ కాట్ బాలీవుడ్ ట్రెండ్ గట్టిగా నడుస్తుంది. ఈక్రమంలో ఈ సినిమా సూపర్ హిట్ అయితే.. చాలా మంది నోళ్లు మూతపడే అవకాశం ఉంది.  ఇప్పటికే ఈ ట్రెండ్ వల్ల భారీ అంచనాలు ఉన్న లైగర్ లాంటి సినిమాలకు గట్టిగా దెబ్బ పడింది. మరి బ్రహ్మాస్త్ర ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందో చూడాలి. ఇక ఈసినిమాలో ఆలియా - రణ్ బీర్ తో పాటు.. బిగ్‌బీ అమితాబ్, కింగ్ నాగార్జున, బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ కూడా ముఖ్య పాత్ర‌లో న‌టించారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌, ప్రైమ్ ఫోక‌స్‌, స్టార్ లైట్ పిక్చ‌ర్స్ సంస్థ‌లు సంయుక్తంగా మూవీని నిర్మించాయి.

Follow Us:
Download App:
  • android
  • ios