ఫస్ట్  షో నుంచి మిశ్రమ స్పందన రాబట్టుకున్న `బ్రహ్మాస్త్ర` చిత్రం తొలి రోజు భారీ ఓపెనింగ్స్ ని రాబట్టింది. ఇది హిందీ చిత్ర పరిశ్రమలోనే రికార్డు కావడం విశేషం.

ప్రతిష్టాత్మకంగా రూపొందిన `బ్రహ్మాస్త్ర` సినిమా శుక్రవారం విడుదలై మిశ్రమ స్పందన రాబట్టుకుంది. కంటెంట్‌ లో దమ్ము లేదని, అసలు కథ ఇందులో లేదంటూ చాలా వరకు అసంతృప్తి వ్యక్తమయ్యింది. కానీ విజువల్‌గా అద్భుతంగా ఉందంటూ క్రిటిక్స్, ఆడియెన్స్ సైతం తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. బాలీవుడ్‌ క్రిటిక్స్ సైతం ఈ సినిమా డిజాస్టర్‌గా ప్రకటించారు. ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ఏకంగా కింగ్‌ సైజ్‌ డిజప్పాయింట్‌మెంట్ అంటూ పోస్ట్ చేశారు. 

కానీ `బ్రహ్మాస్త్ర` వాటన్నింటిని బ్రేక్‌ చేసింది. ఫస్ట్ డే రోజు భారీ ఓపెనింగ్స్ ని రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఏకంగా రూ.75కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. తాజాగా చిత్ర యూనిట్‌ ఈ కలెక్షన్ల లెక్కలను ప్రకటించింది. వరల్డ్ వైడ్‌గా 75కోట్ల వసూలు చేసి రికార్డు సృష్టించిందని వెల్లడించింది. హాలీడేస్‌ లేని సమయంలో ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం ఇదే తొలి సారి అని, ఇదొక రికార్డ్ గా తెలిపారు. కోవిడ్‌ తర్వాత విడుదలైన చిత్రాల్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హిందీ చిత్రంగానూ `బ్రహ్మాస్త్ర` నిలవడం విశేషం. 

సినిమాపై విమర్శలున్నప్పటికీ ఆడియెన్స్ యాక్సెప్ట్ చేశారని చెబుతున్నారు. అందుకు నిదర్శనమే ఈ కలెక్షన్లు అంటున్నారు. అయితే సినిమాలో చాలా వరకు తొలి రోజు ఓపెనింగ్స్ అనేది అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఉంటుంది. ఆ తర్వాత రోజు కలెక్షన్లు, అనగా నేడు, రేపు ఎలా ఉంటుందనేది ఇప్పుడు ముఖ్యం. ఈ రెండు రోజుల్లో ఇదే మెయింటేనే అయితే సినిమాకి తిరుగుండదనేది ట్రేడ్‌ వర్గాల అభిప్రాయం. 

Scroll to load tweet…

ఇక రణ్‌ బీర్‌ కపూర్‌, అలియాభట్‌ జంటగా, నాగార్జున, అమితాబ్‌ బచ్చన్‌, మౌనీరాయ్‌ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించారు. `అస్త్రవర్స్` కాన్సెప్ట్ నుంచి వరుసగా మూడు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలోని తొలి భాగం `బ్రహ్మాస్త్రః శివ` శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. తెలుగులో ఈ చిత్రానికి రాజమౌళి సమర్పకులుగా వ్యవహరించారు. తెలుగులో దీన్ని బాగా ప్రమోట్‌ చేశారు.