Asianet News TeluguAsianet News Telugu

#Brahmastra: 'బ్రహ్మాస్త్ర' సోమవారం కలెక్షన్స్ ...అంత భారీ డ్రాపా? షాక్

రాజమౌళి దక్షిణాదిన భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేసి పంపిణీ చేసిన సినిమా ఇది. మరి ఈ సినిమాకి తెలుగు బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు గిట్టుబాటు అయ్యింది ?, ఈ సినిమాకి సాలిడ్ కలెక్షన్స్ వచ్చాయా ? రాలేదా ? చూద్దాం రండి.

 Brahmastra dropped big on Monday
Author
First Published Sep 13, 2022, 11:31 AM IST


ర‌ణ్‌బీర్‌ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) జంటగా నటించిన 'బ్రహ్మాస్త్ర'కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున, మౌనీ రాయ్, షారూఖ్ ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదలైంది. 

'బ్రహ్మాస్త్ర' (Brahmāstra Part One: Shiva) కు మొదటి రోజు బ్రహ్మాండమైన వసూళ్లు వచ్చాయి. థియేటర్లకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో వచ్చారు. సినిమా విడుదలకు ముందు హీరో హీరోయిన్లు ర‌ణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్ దేశంలో వివిధ నగరాలు తిరిగి చేసిన ప్రచారం... కరణ్ జోహార్, ఎస్.ఎస్. రాజమౌళి వంటి దర్శకులు సినిమా అండగా నిలబడటం  కలిసి వచ్చింది. అందరూ ఊహించినట్లుగానే  ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. వీకెండ్ వరకు కొన్ని స్క్రీన్లు హౌస్ ఫుల్స్ అయ్యాయి. దాంతో సోమవారం  రోజు నుంచి ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందనేది చూడాలని ట్రేడ్ ఎదురుచూస్తోంది. ఎందుకంటే సోమవారం నుంచి అసలు అగ్ని పరీక్ష మొదలు కానుంది. 

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు బ్రహ్మాస్త్ర చిత్రం సోమవారం భారీ డ్రాప్ కనపడింది. 60%  కు పైగా కలెక్షన్స్ అన్ని చోట్లా డ్రాప్ అయ్యాయని సమాచారం. ముఖ్యంగా తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ ఇది కనపడింది.  సోమవారం  ₹1.9 నెట్ వచ్చిందని సమాచారం. చెప్పుకోవటానికి ఈ అంకెలు బాగానే ఉన్నట్లు. కానీ బ్రహ్మాస్త్రం వంటి భారీ సినిమా కలెక్షన్స్ అని చూస్తే మాత్రం చాలా చాలా తక్కువ.  బ్రేక్ ఈవెన్ రావాలంటే మిరాకిల్ జరగాలి అంటున్నారు.

వాస్తవానికి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో తొలి రోజు 'బ్రహ్మాస్త్ర'కు రికార్డు వసూళ్లు వచ్చాయి. మొదటి రోజు ఈ సినిమాకు రూ. 6.70 కోట్ల గ్రాస్ వచ్చిందట. షేర్ చూస్తే... రూ. 3.68 కోట్లుగా ఉంది. ఇప్పుడు తెలుగులో హయ్యస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ 'బ్రహ్మాస్త్ర' పేరు మీద ఉంది. దీనికి ముందు 'ధూమ్ 3' పేరిట ఆ రికార్డ్ ఉంది. ఆమిర్ ఖాన్ డ్యూయల్ రోల్ చేసిన ఆ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.70 కోట్ల గ్రాస్ వచ్చింది. తొమ్మిదేళ్ల తర్వాత ఆ రికార్డును మరో సినిమా క్రాస్ చేయడం విశేషం. 

తెలుగులో 'బ్రహ్మాస్త్రం'గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. దానితో పాటు టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున సినిమాలో రోల్ చేయడం, ఆ సినిమా కంటే ముందు 'ఆర్ఆర్ఆర్'లో ఆలియా భట్ నటించడం ప్లస్ అయ్యింది. అక్కినేని అభిమానులతో పాటు సగటు తెలుగు సినిమా ప్రేక్షకులు సినిమాపై ఆసక్తి కనబరిచారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios