ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ కమెడియన్ గా చక్రం తిప్పిన బ్రహ్మీ హవా ఈ మధ్యకాలంలో బాగా తగ్గింది. ఆయన లేని స్టార్ హీరో సినిమా ఉండేది కాదు. అంతగా ఆడియన్స్ పై ప్రభావం చూపేవాడు. కానీ ఇప్పుడు యంగ్ కమెడియన్ల జోరు ముందు బ్రహ్మీ తేలిపోతున్నాడు. సినిమాల్లో అతడి కామెడీ కూడా పెద్దగా పండడం లేదు.

దీంతో అతడికి అవకాశాలు బాగా తగ్గాయి. రీసెంట్ గా అతడికి గుండె ఆపరేషన్ జరగడంతో ఇక బ్రహ్మీ సినిమాల నుండి శాశ్వతంగా రిటైర్మెంట్ తీసుకుంటారని భావించారు. కానీ ఆయన మాత్రం ఇప్పుడు పూర్తి స్థాయిలో సినిమాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నాడు.

అంతేకాదు తన పారితోషికం కూడా తగ్గించుకోవాలని భావిస్తున్నాడట. గతంలో రోజుకి ఆరు లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాడు బ్రహ్మీ. రెమ్యునరేషన్ విషయంలో అసలు రాజీ పడేవాడు కాదు. చిన్న సినిమా అయినా.. డబ్బు కోసం ఒప్పుకునేవాడు. ఇప్పుడు అలా ప్రాధాన్యం లేని సినిమాలు మానేయాలని నిర్ణయించుకున్నాడట. 

తనకు నచ్చే పాత్రలు కొన్ని ఉన్నాయని, అవి పోషించే ఛాన్స్ వస్తే రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా చేస్తానని బ్రహ్మీ కొందరి దగ్గర  చెప్పినట్లు సమాచారం. మొత్తానికి డబ్బుని పక్కన పెట్టి ఇప్పుడు మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నాడు బ్రహ్మీ.