మాస్ మహారాజ్ రవితేజ, అందాల భామ స్నేహ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం వెంకీ. డైరెక్టర్ శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు 20 ఏళ్ల తర్వాత రి రిలీజ్ అయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. 

మాస్ మహారాజ్ రవితేజ, అందాల భామ స్నేహ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం వెంకీ. డైరెక్టర్ శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు 20 ఏళ్ల తర్వాత రి రిలీజ్ అయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ ట్రెండ్ ని క్యాష్ చేసుకుంటూ వెంకీ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. 

రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా ఉంటుంది వెంకీ. కామెడీ ప్రధాన బలంగా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో పొట్ట చెక్కలు చేసింది. మీమ్స్, సోషల్ మీడియాలో ఫన్నీ పోస్ట్ లు మొదలయింది ఈ చిత్రం నుంచే అని చెప్పొచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫన్నీగా వాడుతున్న 70 శాతం మీమ్స్ లో ఈ చిత్ర కంటెంటే ఉంటుంది అని చెప్పడం లో సందేహం లేదు. 

ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్ లో రవితేజ, బ్రహ్మానందం, ఏవీయస్ మధ్య వచ్చే సన్నివేశాలు ఈ చిత్రానికే హైలైట్ అయ్యాయి. బ్రహ్మానందం కామెడీ టైమింగ్, ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ నెవర్ బిఫోర్ అని చెప్పొచ్చు. 

Scroll to load tweet…

ఈ చిత్రంలో బ్రహ్మానందం గజాల అనే పాత్రలో నటించారు. ఐయామ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ అంటూ నవ్వులు పండించారు. బ్రహ్మానందం గజాల క్రేజ్ ఇంతా ఉంది అంటే రీ రిలీజ్ లో ఆ హంగామా చూస్తే అర్థం అవుతుంది. స్టార్ హీరోల తరహాలో థియేటర్స్ బయట బ్రహ్మానందం కి బ్యానర్లు కడుతున్నారు. లోపల ఏమో బ్రహ్మి ఎంట్రీ ఇవ్వగానే కేరింతలు కొడుతూ పేపర్లు విసిరేస్తూ బీభత్సం సృష్టిస్తున్నారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.