హాస్య బ్రహ్మ బ్రహ్మానందం 66వ ఏట అడుగిడిన సందర్భంగా అభిమానులు, చిత్ర ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ పంచతంత్రం (Panchathantram teaser) చిత్రం నుండి టీజర్ విడుదల చేశారు.
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం బర్త్ డే (Brahmanandam Birthday)నేడు. 1956 ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జన్మించిన బ్రహ్మానందం దేశం మెచ్చిన హాస్యనటుడయ్యారు. మూడు దశాబ్దాల నుండి నిర్విరామంగా హాస్యం పంచుతున్న బ్రహ్మానందం 66వ ఏట అడుగిడిన సందర్భంగా అభిమానులు, చిత్ర ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ పంచతంత్రం (Panchathantram teaser) చిత్రం నుండి టీజర్ విడుదల చేశారు.
పంచతంత్రం మూవీలో బ్రహ్మానందం వేద వ్యాస్ అనే కథకుడిగా నటిస్తున్నారు. కలర్స్ స్వాతి పంచతంత్రం మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నారు. ఆల్ ఇండియా రేడియో రిటైర్డ్ ఉద్యోగి అయిన వేద వ్యాస్ ఈ తరం కుర్రాళ్లతో పోటీకి దిగుతాడు. పంచతంత్రం కథల ద్వారా ఆడియన్స్ ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నారు. కథకుడిగా వేద వ్యాస్ ప్రయాణం ఎలా సాగింది అనేది పంచతంత్రం మూవీలోని అసలు విషయం.
కూతురు స్వాతి ఈ జనరేషన్ తో నువ్వు పోటీపడలేవని డిస్కరేజ్ చేస్తుంటే.... కెరీర్ అంటే 20 ఏళ్ల లోనే మొదలు పెట్టాలా? 60 ఏళ్లలో మొదలు పెట్టకూడదా ? అని బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. హర్ష పులిపాక పంచతంత్రం చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నేడు విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తి రేపుతోంది. ఈ మూవీలో రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్, సముద్ర ఖని సైతం కీలక రోల్స్ చేస్తున్నారు.

2021 బ్లాక్ బస్టర్ జాతిరత్నాలు చిత్రంలో జడ్జి రోల్ చేసిన బ్రహ్మానందం. సూపర్ కామెడీ పంచారు. ప్రస్తుతం పంచతంత్రం మూవీతో పాటు కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ మూవీ చేస్తున్నారు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ కీలక రోల్స్ చేస్తున్న ఈ మూవీలో అనసూయ, శివాత్మిక సైతం నటిస్తున్నారు. వయసు రీత్యా బ్రహ్మానందం సినిమాలు తగ్గించారు. ఆ మధ్య ఆయన అనారోగ్యం పాలయ్యారు. ఈ మధ్య బ్రహ్మాండం సెలెక్టివ్ గా చిత్రాలు చేస్తున్నారు.
బ్రహ్మానందం పుట్టినరోజు నేపాయడంలో ఆయనకు అభిమానులు, చిత్ర ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు. ఆయన ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని, మరింత కాలం వెండితెరపై నవ్వులు పూయించాలని కోరుకుంటున్నారు.
