కార్టూన్‌  నెట్‌వర్క్‌లో కామిక్‌ సీరియల్‌గా మొదలైన ‘లయన్‌ కింగ్‌’ ని డిస్నీ వారు 2డి ఆనిమేటెడ్‌ సినిమాగా 1990లో విడుదల చేశారు. అప్పట్లో సూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమాని ఇప్పుడు 3డి ఆనిమేటెడ్‌ టెక్నాలజీతో, కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌తో ‘లయన్‌ కింగ్‌’ ఫ్యాన్స్‌కి, కామిక్‌ అభిమానులకి సరికొత్త అనుభూతి ఇచ్చేందుకు మరో మారు డిస్నీ వారు ప్రయత్నిస్తున్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా భారీ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు లోకల్ టచ్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు లో కూడా లయన్ కింగ్ భారీ స్థాయిలో విడుదల కి రెడీ అవుతుంది. మొన్నటికి మొన్న హాలీవుడ్ చిత్రం  అలాడిన్ కు వెంకటేష్, వరుణ్ తేజలను ఎంచుకున్నట్లే ఇప్పుడు ఈ సినిమాలో బ్రహ్మీ, అలీ వాయిస్ లను వాడుతున్నారు. 

ఈ సినిమా తెలుగు వెర్ష‌న్ లో పుంబా పాత్ర‌కు హాస్య బ్ర‌హ్మ బ్ర‌హ్మానందం డ‌బ్బింగ్ చెప్పారు, అలానే టీమోన్ పాత్ర‌కు ఆలీ గాత్ర‌ధానం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని ముఖ్య భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే, మార్వేల్ - డిస్నీ సంయుక్తంగా నిర్మించి విడుదల చేసిన అవెంజర్స్ ఎండ్ గేమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ వెంటనే అల్లాద్దీన్ రూపం లో మరో మారు డిస్నీ వారు వరల్డ్ మూవీ లవర్స్ ని అలరించారు. ఇప్పుడు లయన్ కింగ్ రూపం లో మరో హిట్ తమ అకౌంట్ లో పడనుంది అని డిస్నీ ఇండియా బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. 
 
డిస్నీ కామిక్ పుస్తకాల్లో పుట్టిన ఈ సింహం పేరు సింబ, సింబ నే లయన్ కింగ్ కథ కి హీరో, అలానే సింబ తో పాటు టిమోన్ అనే ముంగిస పుంబా అనే అడివి పంది లయన్ కింగ్ కథ లో ముఖ్య పాత్రలు. ఇంతకీ సింహం,సింబ పాత్రకు ఎవరు డబ్బింగ్ చెప్తారో చూడాలి.