ఈ మధ్యకాలంలో రోజు కో సారి ప్రతీ మీడియా బోయపాటి శ్రీను ని తలుచుకుంటోంది. రామ్ చరణ్ తో చేసిన సినిమా వినయ విధేయరామ హిట్ అయితే ఇంత హడావిడి జరిగేదో లేదో కానీ...డిజాస్టర్ అవటం మాత్రం ఆయని క్రేజ్ ని ఒకేసారి రోడ్డు మీదకు లాగేసింది. దానికి తోడు ఆయన మైత్రీ మూవిస్ బ్యానర్ నుంచి వెనక్కి ఇచ్చేసిన అడ్వాన్స్ కూడా హాట్ టాపిక్ గా నిలిచింది. అయితే బోయపాటి ఇప్పుడేం చేస్తున్నారు అంటే...బాలయ్య సినిమా కోసం స్క్రిప్టు వర్క్ చేసుకున్నాడని అంతా భావిస్తారు.

అయితే బోయపాటి మరేం చేస్తున్నట్లు అంటే..  ప్ర‌స్తుతం అమ‌రావ‌తిలో బిజిగా ఉన్నారు. తనను మొదటి నుంచి నమ్మిన తెలుగుదేశం పార్టీ కోసం యాడ్స్ షూట్ చేస్తున్నారు. అది కొద్ది రోజుల్లో  ఎన్నిక‌లు వస్తూండటంతో... తెలుగుదేశం పార్టీ ప్ర‌చారానికి వాడుకోవ‌డానికి అనువుగా ఆయ‌న యాడ్స్ కాన్సెప్ట్ లు మీద వర్కవుట్స్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన మంచి రెమ్యునేషన్ సైతం ముట్టనుంది. అలాగే అల్లరి రవిబాబు సైతం తెలుగుదేశం యాడ్స్ కోసం కాన్సెప్టులు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

కాకపోతే చంద్రబాబు నాయుడు మాత్రం బోయపాటికే ఈ యాడ్ క్యాంపైన్ పని అప్పచెప్పినట్లు సమాచారం. పార్టి అధికారంలోకి మరోసారి వస్తే బోయపాటికు ప్రత్యేకమై పదవి కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.  గ‌తంలో పుష్క‌రాల‌కు సంబంధించిన యాడ్‌లు కూడా బోయ‌పాటి చేసిన సంగ‌తి తెలిసిందే.