బోయపాటి.. బన్నీని ఎందుకు కలిసినట్లు?

boyapati srinu to work with allu arjun again
Highlights

దర్శకుడు బోయపాటి ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా సినిమాను రూపొందిస్తున్నాడు

దర్శకుడు బోయపాటి ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. సినిమా పనుల్లో బిజీబిజీగా ఉన్న బోయపాటి సడెన్ గా గీతాఆర్ట్స్ లో ప్రత్యక్షమయ్యాడు. బన్నీ కోసం ప్రత్యేకంగా ఆయన అక్కడకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం పెరిగిపోతుంది. గతంలో అల్లు అర్జున్ హీరోగా బోయపాటి 'సరైనోడు' అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించారు.

ఈ సినిమా ఇద్దరికీ మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా రానుందా? అనే వార్తలు గుప్పుమన్నాయి. నిజానికి బోయపాటి.. చరణ్ సినిమా పూర్తయిన తరువాత బాలయ్యతో మరో సినిమా ప్లాన్ చేశాడు. కాబట్టి బన్నీతో సినిమా చేసే గ్యాప్ లేదు. ప్రస్తుతానికి బన్నీ సరైన కథ కోసం చూస్తున్నారు. ఇలాంటి సమయంలో బోయపాటి స్పెషల్ గా బన్నీను కలవడంతో మళ్లీ కలిసి సినిమా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.

మరోపక్క హరీష్ శంకర్, సంపత్ నంది, విక్రమ్ కుమార్ వంటి దర్శకులు బన్నీతో కలిసి సినిమా చేయాలనుకుంటున్నారు. మరి ఏం ఫిక్స్ అవుతాడో చూడాలి!

loader