Asianet News TeluguAsianet News Telugu

'స్కంద' OTT డేట్ ఫిక్స్? ...అంత త్వరగానా,షాక్

రొటీన్ కమర్షియల్ సినిమా ఫార్మట్ ను నమ్ముకొని స్కంద సినిమా తీయడంతో ప్రేక్షకులు చాలా నిరాశ చెందారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా రిలీజ్ అవ్వగా, రిలీజైన మొదటి రోజు నుంచే స్కంద సినిమా తీవ్ర నెగిటివిటి వచ్చింది. 

Boyapati Srinu, Ram pothineni skanda Releasing Date On OTT jsp
Author
First Published Oct 12, 2023, 1:51 PM IST

మాస్ ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) డైరెక్ష‌న్‌లో, రామ్ హీరోగా  రూపొందిన చిత్రం స్కంధ. యాక్షన్ ప్రియులని టార్గెట్ చేసిన ఈ చిత్రం అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు.  'తియ్యాలే, పొయ్యాలే, గట్టిగా అరిస్తే తొయ్యాలే, అడ్డం వస్తే లేపాలి' -  వంటి   డైలాగ్స్  వైరల్ అయినా  ఫలితం లేదు!  సినిమాలో  హీరో రామ్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌లో చూపించాడు బోయ‌పాటి.  బోయ‌పాటి మార్క్ యాక్ష‌న్ సీన్స్‌, రామ్ డైలాగ్‌లు విజిల్స్ వేయించేలా ఉన్నాయి.  అయితే మరీ ఓవర్ గా సినిమా లో కంటెంట్ ఉండటం..రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రలను మరీ ఓవర్ గా చూపించటం వంటివి  నచ్చలేదనే విమర్శలు వచ్చాయి.  

రొటీన్ కమర్షియల్ సినిమా ఫార్మట్ ను నమ్ముకొని స్కంద సినిమా తీయడంతో అభిమానులు సైతం  చాలా నిరాశ చెందారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా రిలీజ్ అవ్వగా, రిలీజైన మొదటి రోజు నుంచే స్కంద సినిమా తీవ్ర నెగిటివిటి వచ్చింది. దాంతో ఇక స్కంద సినిమా ఆడటం కష్టమే అని తేల్చేసారు. ఈ క్రమంలో ఈ చిత్రం ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారని తెలుస్తోంది. 

 ఈ చిత్రం డిజిటల్ రైట్స్ Disney/Hotstar సొంతం చేసుకుంది.  కోసం 45 కోట్లు ఓటిటికు ఈ రైట్స్ ఇవ్వటం జరిగింది. ఇది అసలు రామ్ సినిమాకు ఊహించని ఎమౌంట్.  ఈ మూవీని అక్టోబర్ 27 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన సంస్థ నుంచి రాలేదు. 
  
రామ్ పోతినేని, శ్రీ లీల జంటగా నటించిన ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ రెండో  హీరోయిన్ . శ్రీకాంత్, ఇంద్రజ, గౌతమి, పృథ్వీరాజ్, ప్రిన్స్ ప్రధాన తారాగణం.  బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేశారు. 'స్కంద' చిత్రానికి కూర్పు : తమ్మిరాజు, ఛాయాగ్రహణం : సంతోష్ డిటాకే, సమర్పణ : జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్, సంగీతం : ఎస్ తమన్, నిర్మాత : శ్రీనివాస చిట్టూరి, రచన - దర్శకత్వం : బోయపాటి శ్రీను.
 

Follow Us:
Download App:
  • android
  • ios