గత కొద్ది రోజులుగా మీడియాలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖిల్ హీరోగా చిత్రం రూపొందనుందంటూ వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.  అఖిల్ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించబోతున్నట్లు కూడా చెప్పుకున్నారు. దాంతో అఖిల్ నుంచి సాలీడ్ యాక్షన్ సినిమా రాబోతోందంటూ ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. అయితే తాజాగా రివీల్ అయిన విషయం ఏమిటంటే...ఆ ప్రాజెక్టు లేదట. బోయపాటి తన హీరో బాలకృష్ణతోనే తదుపరి చిత్రం ప్లాన్ చేసుకుంటున్నాడట. 

ప్రస్తుతం రామ్ చరణ్ తో చేస్తున్న 'వినయ విధేయ రామ' తరువాత నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు బోయపాటి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. త్వరలో ఈ చిత్రం పట్టాలెక్కనుందని సమాచారం. ఈ మేరకు స్క్రిప్టు వర్క్ కూడా ఓ ప్రక్కన బోయపాటి లాగిస్తున్నారట.

'సింహా', 'లెజెండ్' తరువాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో రానున్న సినిమా కావడంతో.. ఈ హ్యాట్రిక్ మూవీపై మంచి అంచనాలే నెలకొన్నాయి. అంతవరకూ బాగానే ఉంది కానీ అఖిల్ సినిమా ఎందుకు డ్రాప్ అయ్యినట్లు అనేది ఫిల్మ్ సర్కిల్స్ లో పెద్ద క్వచ్చిన్ గా మారింది.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం...అప్పుడే ఆ రేంజి యాక్షన్ ఇమేజ్ వద్దనుకున్నాడట అఖిల్. పోనీ లవ్ స్టోరీ ప్లాన్ చేద్దామని బోయపాటి అంటే..బోయపాటి అంటే యాక్షన్ మోడ్ లో జనం ఫిక్స్ అయ్యి థియోటర్స్ కు వస్తారు. కాబట్టి అలాంటి ప్రయోగం చేయవద్దని సున్నితంగా చెప్పారట. 

ఈ విషయంలో నాగార్జున మాట సాయిం తీసుకున్నాడట అఖిల్. దాంతో బోయపాటి శ్రీను ..మరో రెండు మూడు సినిమాలు అఖిల్ చేసాక యాక్షన్ సినిమా చేద్దామని మాట ఇచ్చాడట. అలా బోయపాటి, అఖిల్ కాంబో ఆగిపోయిందని సినీ వర్గాల కథనం. ఇందులో నిజమెంత ఉందనేది అఖిల్ కానీ, బోయపాటి కానీ చెప్పాలి.