నందమూరి బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కాంబినేషన్ పై గత కొంత కాలంగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి. సినిమా స్టోరీ నచ్చక బాలకృష్ణ మధ్యలో మరో దర్శకుడితో కమిటయ్యాడని ఇన్ సైడ్ టాక్. దీంతో బోయపాటితో ఇప్పట్లో సినిమా లేనట్లే అనే టాక్ వచ్చింది. 

కానీ ఇప్పుడు బాలకృష్ణ మళ్ళీ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. తప్పకుండా సినిమా చేద్దామని బోయపాటికి బాలయ్య మాటిచ్చేశాడట. అదే ధైర్యంతో బోయపాటి కథను డెవలప్ చేసే పనిలో బిజీగా గడుపుతున్నాడు. రీసెంట్ గా స్క్రిప్ట్ డిస్కర్షన్ లో బాలయ్య బోయపాటితో మాట్లాడినట్లు తెలుస్తోంది. కాస్త సమయం పట్టేలా ఉందని బాలయ్య చెప్పినప్పటికీ బోయపాటి వెయిట్ చేస్తానని చెబుతున్నాడట. 

కుదిరితే కెఎస్.రవికుమార్ ప్రాజెక్ట్ ని అలాగే బోయపాటి శ్రీనివాస్ సినిమాను ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్లాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నాడట. వచ్చే సంక్రాంతి బరిలో ఎదో ఒక సినిమాతో రెడీగా ఉండాలని కోరుకుంటున్న నందమూరి ఫ్యాన్స్ కి బాలకృష్ణ ఎలాంటి కిక్కిస్తాడో చూడాలి.