అయితే ఆ యాడ్స్ కూడా ఓ రేంజిలో ఓవర్ డ్రామా తో ఉంటున్నాయి. యాడ్స్ లో కంటెంట్ , భారీతనం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి..అందరిలో చర్చనీయాశంగా మారుస్తున్నాయి. రీసెంట్ గా టీవీ ఛానెల్స్ లో వదిలిన యాడ్ అయితే మరీ వింతగా ఉంటోందని విమర్శలు వస్తున్నాయి.

ఆ యాడ్ లో  ఒక అనాథ అమ్మాయికి గుడిలో పెళ్లి జరుగుతూంటుంది. అక్కడ .. ఆమె చంద్రబాబును తన అన్నగా చెప్తూ... లఘ్నపత్రికలో కుటుంబ పెద్దగా ఆయన పేరే రాయించటం. అందుకు కారణం చంద్రబాబు తమ వంటి వారికిచాలా చేసారంటూ చెప్తుంది. .. ఇలా సాగే ఈ  ప్రకటన తాజాగా హాట్ టాపిక్ అవుతోంది.

మరొక యాడ్ లో ...‘మీ కళ్లు ముందు కడుతున్న రాజధాని గ్రాఫిక్స్.. పోలవరం గ్రాఫిక్స్.. పారుతున్న నీళ్లు కూడా గ్రాఫిక్సేనరా...నీళ్లన్న చోట కన్నీరుండదని నమ్మిన మనిషిరా చంద్రబాబు.. అలాంటి మంచి మనిషికి ఓటేసి నిలబెట్టుకోవడం మన బాధ్యత’ అంటూ భారీ డైలాగ్ వస్తూంటాయి. బ్యాగ్రౌండ్‌లో అదిరిపోయే రీరికార్డింగ్ ఇదంతా బోయపాటి మార్క్ యాడ్స్ స్పెషాలిటీ.

ఈ ప్రకటన  చూసి బోయపాటిని కొందరు...కంటెంట్ ని కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేసావని  పొగిడుతూంటే..మరికొందరు ... సెటైర్లు వేసేవాళ్లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు మీద చాలా ఎమోషనల్‌గా సాగే ఒక పాటను కూడా బోయపాటి రెడీ చేసి వదిలాడు. ఆ పాట తెలుగు భారీ సినిమాలకు ఏమాత్రం తగ్గని స్థాయిలో హై స్టాండర్డ్స్‌లో, చాలా ఎఫెక్టివ్‌గా ఉండటం  చెప్పుకోదగ్గ విషయం.