Asianet News TeluguAsianet News Telugu

బోయపాటి శ్రీను కామెంట్స్ వైరల్‌.. తమన్‌ షాకింగ్‌ కౌంటర్‌..

`అఖండ`, `స్కంద` సినిమాలపై దర్శకుడు బోయపాటి శ్రీను చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే తాజాగా థమన్‌ దీనికి స్పందిస్తూ షాకింగ్‌ పోస్ట్ పెట్టాడు.

boyapati sreenu comments thaman post hot topic arj
Author
First Published Oct 8, 2023, 3:51 PM IST

మాస్‌ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను.. ఇటీవల `స్కంద` చిత్రంతో వచ్చారు. ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది. బాక్సాఫీసు వద్ద సుమారు రూ.60కోట్లకుపైగా గ్రాస్‌ని సాధించింది. రూ.48కోట్ల బిజినెస్‌తో విడుదలైన ఈ చిత్రం ముప్పైకోట్లకుపైగా షేర్‌ని సాధించింది. కొంత నష్టాలను మిగిల్చబోతుంది. కానీ ఆ వారం విడుదలైన వాటిలో `పెదకాపు`, `చంద్రముఖి2`లతో పోల్చితే బెటర్‌గా కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది.

అయితే ఇందులో థమన్‌ మ్యూజిక్‌ పై నెగటివ్‌ కామెంట్లు వచ్చాయి. బిజీఎం విషయంలో, పాటల విషయంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. `అఖండ`ని మించి బీజీఎం కొట్టాడు కానీ, అది మిస్‌ ఫైర్‌ అయ్యింది. సౌండ్‌ పెంచాడు తప్ప, అందులో రిథమ్‌ లేదని, పరమ రొటీన్‌గా, చెవులు పగిలిపోయేలా ఉందనే కామెంట్స్ వచ్చాయి. అయితే తాజాగా దర్శకుడు బోయపాటి ఓ యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు. ఆ ఒక్క కంప్లెయింట్‌ అయితే ఉందని అన్నారు. అదే సమయంలో `అఖండ` ప్రస్తావన వచ్చినప్పుడు జర్నలిస్ట్.. `అఖండ` ఆ రేంజ్‌లో ఎలివేట్‌ కావడానికి థమన్‌ ప్రాణం పెట్టాడని, ఆయన మ్యూజిక్‌ నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్లిందన్నారు. 

దానికి బోయపాటి శ్రీను స్పందిస్తూ, ఆ సినిమాని ఆర్‌ ఆర్‌ లేకుండా చూసినా మీరు గర్వంగా ఫీలవుతారని, దానికి అంత దమ్ము ఉంటుందని, అదే సమయంలో ఆ పర్టిక్యులర్ కల్ట్ మీద థమన్‌ అద్భుతంగా చేయగలిగాడు` అని బోయపాటి తెలిపారు. ఈ నేపథ్యంలో బోయపాటి కామెంట్లని నెటిజన్లు రకరకాలుగా తీసుకుంటున్నారు. థమన్‌ చేసిందేం లేదని, థమన్‌ని తక్కువ చేశాడని రకరకాలుగా కామెంట్లతో వైరల్‌, ట్రోల్స్ చేస్తున్నారు. ఇటు బోయపాటు, అటు థమన్‌ని ట్రోల్‌ చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో తాజాగా మ్యూజిక్ డైరెక్టర్‌ థమన్‌ పోస్ట్ హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఆయన `ఐ డోంన్ట్ కేర్‌` అని పేర్కొంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. అయితే థమన్‌ ఉద్దేశ్యం ఏంటి? ఎవరిని ఉద్దేశించి అనేది ఆసక్తికరంగా మారింది. కానీ చాలా వరకు అది బోయపాటి కామెంట్లకి కౌంటర్ అని అంటున్నారు నెటిజన్లు. బోయపాటి వ్యాఖ్యలపైనే థమన్‌ రియాక్ట్ అయ్యాడని అంటున్నారు. దీంతో ఇప్పుడు నెట్టింట కొత్త రచ్చ స్టార్ట్ అయ్యింది. అటు బోయపాటిని, ఇటు థమన్‌ని ఆడుకుంటున్నారు. ట్యూన్లు కాపీ కొడతావంటూ థమన్‌ని ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌ అవుతుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios