స్కంద 2 కంఫర్మ్..సీక్వెల్ పై హింట్ ఇచ్చిన బోయపాటి, రాపో మాస్ మరోసారి..
ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద. డ్యాన్స్ అయినా, డైలాగ్ డెలివరీ అయినా, యాక్షన్ సన్నివేశం అయినా హీరో రామ్ ఎనెర్జీ వేరే లెవల్ లో ఉంటుంది. అలాంటి హీరో పవర్ హౌస్ లాంటి మాస్ డైరెక్టర్ బోయపాటితో చేతులు కలిపితే సిల్వర్ స్క్రీన్ పై జాతర ఒక రేంజ్ లో ఉంటుందని ఆశించవచ్చు.
ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద. డ్యాన్స్ అయినా, డైలాగ్ డెలివరీ అయినా, యాక్షన్ సన్నివేశం అయినా హీరో రామ్ ఎనెర్జీ వేరే లెవల్ లో ఉంటుంది. అలాంటి హీరో పవర్ హౌస్ లాంటి మాస్ డైరెక్టర్ బోయపాటితో చేతులు కలిపితే సిల్వర్ స్క్రీన్ పై జాతర ఒక రేంజ్ లో ఉంటుందని ఆశించవచ్చు. ఆ తరహాగా హై ఓల్టేజ్ అంచనాలతోనే స్కంద చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఆల్రెడీ ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ మొదలైపోయింది. బోయపాటి మాస్ చిత్రాలని ఇష్టపడే వారికీ ఈ చిత్రం కూడా నచ్చుతుంది అని అంటున్నారు. కానీ వైవిధ్యం కోరుకునే ఫ్యాన్స్ కి మాత్రం నిరాశ అని అంటున్నారు. అయితే ఊహించని విధంగా స్కంద 2 తెరపైకి వచ్చింది. స్కంద చిత్రం చివర్లో సీక్వెల్ ఉందంటూ డైరెక్టర్ బోయపాటి హింట్ ఇచ్చారు.
అదిరిపోయే క్రేజీ ట్విస్ట్ తో స్కందకి సీక్వెల్ ఉందని తెలిపారు. మరి బోయపాటి స్కంద 2 కి ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ చేసారా లేక స్కంద కి వచ్చే రెస్పాన్స్ బట్టి నిర్ణయం తీసుకుంటారా అనేది చూడాలి.
ఏది ఏమైనా స్కంద చివర్లో ఇచ్చిన హింట్ ప్రకారం స్కంద 2 అఫీషియల్ గా అనౌన్స్ చేసినట్లే అని చెప్పాలి. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సీక్వెల్స్ ట్రెండ్ కొనసాగుతోంది. బోయపాటి కూడా అదే ఫాలో అయినట్లు ఉన్నారు. ఇదిలా ఉండగా స్కంద చిత్రంలో రామ్ నెవర్ బిఫోర్ మాస్ అవతార్ లో కనిపించినట్లు ఆడియన్స్ చెబుతున్నారు. ఇక స్కంద 2 కనుక వస్తే రాపో మాస్ మరో లెవల్ లో ఉంటుంది అని అంటున్నారు.