దర్శకుడు బోయపాటితో యంగ్ హీరో అఖిల్ సినిమా చేయనున్నాడని అప్పట్లో వార్తలు బాగా వినిపించాయి. నిజానికి అఖిల్ తొలి సినిమా సమయంలో బోయపాటి పేరు బాగా వినిపించింది. నాగార్జున.. బోయపాటితో చర్చలు కూడా జరిపారు.

కానీ సినిమా వర్కవుట్ కాలేదు. తాజాగా అఖిల్ హీరోగా బోయపాటి ఓ సినిమా చెయనున్నాడని, దానికి రామ్ చరణ్ నిర్మాత అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ ముగ్గురి కాంబినేషన్ లో సినిమా అనగానే వార్త వైరల్ అయింది.

అయితే ఈ విషయంపై దర్శకుడు బోయపాటి ఓ మీడియా సంస్థకి క్లారిటీ ఇచ్చాడు. ''అఖిల్ తో సినిమా అనే వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం నా దృష్టి మొత్తం రామ్ చరణ్ సినిమాపైనే ఉంది. ఆ తరువాత నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేయాల్సివుంది.

ఆ తరువాత ఏం చేయాలనే విషయం ఇంకా ఆలోచించలేదు. కథను బట్టి ప్రొసీడ్ అవుతా'' అంటూ వెల్లడించారు. అంటే ఇప్పట్లో అఖిల్ తో సినిమా చేసే ఛాన్స్ లేదని తెలుస్తోంది. మరోపక్క అఖిల్ 'మిస్టర్ మజ్ను' సినిమా పూర్తయిన తరువాత ఓ తమిళ దర్శకుడితో సినిమా చేయాలనుకుంటున్నాడు. మరి బోయపాటితో అఖిల్ ఎప్పుడు సినిమా చేస్తాడో..? 

అఖిల్ కు హిట్ కోసం..ప్రాజెక్టు సెట్ చేసిన రామ్ చరణ్