కెరీర్ ప్రారంభం నుంచి అక్కినేని అఖిల్ కు అవాంతరాలే. ఎంతో ఇష్టపడి,కష్టపడి చేసిన తొలి చిత్రం అఖిల్ భాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో చాలా గ్యాప్ తీసుకుని ఎన్నో కథలు విని, ప్రూవెడ్ డైరక్టర్ అని నమ్మి విక్రమ్ కుమార్ తో హలో అంటూ చేస్తే అదీ చీదేసింది. దాంతో అఖిల్ ఇప్పుడు తన మూడో ప్రాజెక్టుని వరుణ్ తేజ తో తొలి ప్రేమ అంటూ హిట్ ఇచ్చిన డైరక్టర్ తో ఓకే చేసి షూటింగ్ లో బిజీగా ఉంటున్నారు. అయితే సాలిడ్ హిట్ ఒకటి రాలేదని తన స్నేహితుడు రామ్ చరణ్ తో షేర్ చేసుకుంటే..ఆయనో ప్రాజెక్టు సెట్ చేస్తున్నట్లు సమాచారం.

తనతో ప్రస్తుతం సినిమా చేస్తున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖిల్ కు ఓ సినిమా సెట్ చేసారట. అలాగే నిర్మాత గానూ తనే ఉంటానని ..చెప్పి అఖిల్ కు యాక్షన్ స్టోరీ రెడీ చేయమని పురమాయించాడట. దాంతో ఇప్పటికే బోయపాటి ఓ స్టోరీ లైన్ ని అఖిల్ కు చెప్పి ఓకే చేయించుకున్నారట. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుందని సమాచారం. 

అన్ని సరిగ్గా కుదరితే మార్చి 2019లో ఈ ప్రాజెక్టు ప్రారంభం అవుతుంది. వచ్చే సంవత్సరం చివర్లో రిలీజ్ కు వెళ్తుంది. బోయపాటి ప్రాజెక్టు పట్టాలు ఎక్కుంతోందనే విషయం తెలిసిన నాగార్జున సైతం ఖుషీగా ఉన్నారట. లవ్ స్టోరి తో కలిసిన యాక్షన్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కనుంది. మరిన్ని డిటేల్స్ త్వరలో ...అందజేస్తాం.