రేపే విడుదల.. భర్తతో సమంత పోటీ!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 12, Sep 2018, 5:16 PM IST
box office: competiton between naga chaitanya and samantha
Highlights

అక్కినేని నాగచైతన్య నటించిన 'శైలజా రెడ్డి అల్లుడు', సమంత నటించిన 'యూటర్న్' సినిమాలు రేపు వినాయకచవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 

అక్కినేని నాగచైతన్య నటించిన 'శైలజా రెడ్డి అల్లుడు', సమంత నటించిన 'యూటర్న్' సినిమాలు రేపు వినాయకచవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే భార్యాభర్తల మధ్య ఈ కాంపిటీషన్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి తన భర్తతో పోటీగా సినిమా విడుదల చేయడం సమంతకి ఇష్టం లేనప్పటికీ నిర్మాతలు మాత్రం అంగీకరించలేదట. ఇక చేసేదేం లేక సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటోంది సమంత. ఈ ఏడాది ఇప్పటికే మూడు విజయాలను తన ఖాతాలో వేసుకున్న సమంత ఇప్పుడు 'యూటర్న్' తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతుంది. అయితే 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమాతో పోలిస్తే సమంత సినిమాకు కాస్త బజ్ తక్కువగానే కనిపిస్తోంది.

పైగా ఇది రీమేక్ సినిమా కావడంతో ప్రేక్షకుల దృష్టి నాగచైతన్య 'శైలజా రెడ్డి అల్లుడు'పై పడింది. అత్త, అల్లుళ్ల ఈగో కాన్సెప్ట్ తో నడిచే ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ ఏర్పడింది. ట్రైలర్ ని బట్టి ఇది ఫుల్ మీల్స్ సినిమా అని తెలుస్తోంది. సినిమాకు హిట్ టాక్ వస్తే గనుక బాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శించడం ఖాయం. మరి ఈ రెండు చిత్రాల్లో ఏ సినిమాకు ప్రేక్షకాదరణ దక్కుతుందో చూడాలి! 

loader