బ్రో, బేబి సినిమాలు ఆగస్టు 25వ తేదీన ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్  స్టార్ట్ అయ్యాయి.   ఈనేపధ్యంలో ఈ రెండింటికి ఓటిటిలో వస్తున్న రెస్పాన్స్ ఏమిటనేది ఆసక్తికరమైన విషయం

ఓటిటి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఎదురుచూస్తున్న ఆ రెండు సినిమాలు ఓటీటీలోకి వచ్చేసి హంగామా చేస్తున్నాయి. ఈ వారం ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా... ముఖ్యంగా ఆ రెండు సినిమాల కోసమే ప్రేక్షకులు వెయింటింగ్ చేస్తున్నారు. ఆ సినిమాలే బ్రో, బేబి సినిమాలు. ఆగస్టు 25వ తేదీన ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యాయి. ఈనేపధ్యంలో ఈ రెండింటికి ఓటిటిలో వస్తున్న రెస్పాన్స్ ఏమిటనేది ఆసక్తికరమైన విషయంగా మారింది. 

మొదటిగా పవన్‌కల్యాణ్‌(Pawan kalyan) సాయిధరమ్‌ (Sai dharam tej) తేజ్‌ హీరోలుగా నటించిన బ్రో’ (Bro) చిత్రం ఈ శుక్రవారం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సినిమా జులై 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల అయిన మొదటి రోజు నుంచే ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. దానితో పాటు అనేక వివాదాలు కూడా తలెత్తాయి. ఇక ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆగస్టు 25నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.

‘వినోదాయసిత్తం’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం థియేటర్ లో చూడని వారు ఓటిటిలో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాపై తమ ఆలోచనలను, రివ్యూలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొంతమంది పవన్ స్వాగ్, స్టైల్ ని ఎంజాయ్ చేసామంటూంటే...మరికొంతమంది సెకండాఫ్ ని ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూసామని అంటున్నారు. లాగ్ ఉందని, డ్రాగ్ చేసారని, పవన్ చేత స్పీచ్ లు ఇప్పించారని ఓటిటి వెర్షన్ లో అయినా అది ఎడిట్ చేస్తే బాగుండేది అంటున్నారు. ఇది పవన్ చేయాల్సిన సినిమా కాదని తేల్చి చెప్తున్నారు. సముద్రఖని దర్శకత్వంలో జీస్టూడియోస్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం గత నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించింది. ఇక ఈమూవీని జీ తెలుగు శాటిలైట్ రైట్స్ తీసుకుంది.

ఇక బేబి విషయానికి వస్తే...ఎలాంటి ఎక్సపెక్టేషన్స్ లేకుండా విడుదలై భారీ విజయం సాధించిన ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ ‘బేబీ’. (Baby) ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య నటించారు. సాయి రాజేశ్‌ దర్శకత్వంలో ఎస్‌కెఎన్‌ నిర్మించారు. థియేటర్‌లో సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఈనెల 25న తెలుగు ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ అవుతోంది. బేబీలో కొన్ని ఎక్స్ ట్రా సీన్స్ కూడా యాడ్ చేశారు. దాంతో ఈ సినిమాను థియేటర్లలో చూసినా, చూడకపోయినా.. మరోసారి ఓటీటీలో చూస్తున్నారు.

ఈ సినిమా ఓటిటి లో చూసిన ప్యామిలీ ఆడియన్స్ కు నచ్చటంలేదు. కొన్ని డైలాగులు, బోల్డ్ కంటెంట్ ఇబ్బందిగా ఉందంటున్నారు. అయితే యూత్ బాగా ఎంజాయ్ చేస్తున్నారని వారి కామెంట్స్ ని బట్టి అర్దమవుతోంది. మొత్తానికి బ్రో, బేబి రెండు కూడా ఓటిటిలో మిక్సెడ్ టాక్ తెచ్చుకున్నాయి. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బేబి. ఈ సినిమాకు సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను శ్రీనివాస కుమార్ (ఎస్కేఎన్) నిర్మించారు. విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చు.