అదితి రావ్ హైదరి హీరోయిన్ గా నటించిన మహా సముద్రం విడుదల నేపథ్యంలో ఆమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సంధర్భంగా పలు ఆసక్తికర విషయాలు అదితి పంచుకున్నారు.  

అందాల తార అదితి రావ్ హైదరి మహా అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆమె హీరోయిన్ గా నటించిన మహా సముద్రం విడుదల నేపథ్యంలో ఆమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సంధర్భంగా పలు ఆసక్తికర విషయాలు అదితి పంచుకున్నారు. 
మహా సముద్రం సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ... ఈ మూవీలో మహా గా ఓ సీరియస్ అండ్ స్వీట్ రోల్ చేశాను. నా పాత్ర తీరు కొంచెం హార్డ్ గా కూడా ఉంటుంది. అజయ్ భూపతి గారు చెప్పిన కథ నాకు బాగా నచ్చేసింది. ఇక మహా సముద్రం నుండి రెండు ట్రైలర్స్ విడుదలైనా... కథను ఎవరూ అంచనా వేయలేకపోయారు. 
ఎందుకంటే ఇది ఒక విన్నూతమైన కథ అని అదితి అన్నారు. 

ఇక ప్రేమ కథను చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను. సరైన కథ, సరైన దర్శకుడి కోసం ఎదురుచూస్తుంటానని అదితి తెలియజేశారు. ఇక హైదరాబాద్ కానీ, పెరిగింది నార్త్‌లోనే. నాకు తెలుగు అంతగా రాదు. అయితే నాకు డైలాగ్స్‌ ఇచ్చి, అర్ధరాత్రి లేపి సీన్‌ నంబర్‌ చెబితే ఇట్టే చెబుతాను.. అంతలా బట్టీపట్టేస్తాను.బయోపిక్స్‌లో నటించడం నాకు ఇష్టం. ఎంఎస్‌ సుబ్బలక్ష్మీ, రేఖగార్ల బయోపిక్‌ అయితే బాగుంటుందని తన కోరిక బయటపెట్టారు అదితి.

Also read చెల్లి బర్త్ డే పార్టీలో బాయ్ ఫ్రెండ్ తో పాటు శృతి హాసన్ రచ్చ... ఓపెన్ అయిపోయారు, పెళ్లి ప్రకటన రానుందా!
శర్వానంద్, సిద్ధార్థ్, అనూ ఇమ్మాన్యుయేల్, అదితీరావు హైదరీ ముఖ్య పాత్రల్లో ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మహాసముద్రం’. సుంకర రామబ్రహ్మం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలవుతోంది.