Asianet News TeluguAsianet News Telugu

రామోజీరావు ఇలా చేస్తారని ఎవరూ ఊహించలా, షాక్!

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ ఉత్సాహంలో ఆయన తన ఈటీవి స్టాఫ్ అందరినీ ఆనందపరచాలనుకున్నారు. అందరికీ బోనస్ లు ప్రకటించి ఆశ్చర్యపరిచారు. 

Bonus Payment for Employees at Work in Eetv
Author
Hyderabad, First Published Aug 28, 2020, 9:17 AM IST

ఈటీవీ రజతోత్సవం జరుపుకొంటున్న వేళ రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ ఉత్సాహంలో ఆయన తన ఈటీవి స్టాఫ్ అందరినీ ఆనందపరచాలనుకున్నారు. ఓ ప్రక్కన కరోనాతో అన్ని సంస్దలూ కుదేలవుతూ, జీతాలు తగ్గిస్తూ, స్టాఫ్ ని తీసేస్తూంటే , రామోజీరావు మాత్రం బోనస్ లు ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. మిగతా సంస్దలకు షాక్ ఇచ్చారు.

అసలు రామోజీరావు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని స్టాఫ్ అసలు ఊహించలేదట. ఈ విషయమై టీవి మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మిగతా ఛానెల్స్ యాజమాన్యాలు ఇది తమ సమస్య అవుతుందా అని ఆలోచనలో పడే సిట్యువేషన్ క్రియేట్ అయ్యిందని సమాచారం. 

తమ సంస్దలో సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న వారికి రెండు నెలలు…మిగిలిన వారికి నెలన్నర, నెల బోనస్‌గా ఇస్తున్నట్లుగా అధికారికంగా ఉద్యోగులందరికీ సమాచారం పంపారు. అలాగే తన స్టాఫ్ కు రామోజీరావు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ విజయం దేశ, విదేశాల్లోని తెలుగు వారిదని.. ఈ ఘనత, చరిత ప్రేక్షకులదేనంటూ మనసారా ధన్యవాదాలు తెలిపారు. సకుటుంబ సమేతంగా ఛానల్‌ను చూసేలా ప్రయాణం ప్రారంభించిన ఈటీవీ.. ఇప్పటికీ అదే నిబద్ధతతో ముందుకు సాగుతోందన్నారు. ఇకముందూ తెలుగువారికి ఎప్పటిలా ఈటీవీ తిరుగులేని వినోదాలు అందిస్తుందని మాటిచ్చారు.  

ఈటీవీ ప్రారంభించిన రోజే నేను ఒక మాటిచ్చాను. ఈటీవీలో ప్రసారమయ్యే ఏ కార్యక్రమమైనా అందంగా, ఆరోగ్యకరంగా ఉంటుందనీ.. అనుభూతిని కలిగించి ఆలోచన రేకెత్తిస్తుందని చెప్పాను. ఈరోజు వరకు ఈటీవీ ఈ నిబద్ధతను నిజాయతీగా పాటించింది.

ప్రయోగం లేకపోతే ప్రయాణమే లేదు.. కొత్తను ఎప్పుడూ ఆహ్వానించాల్సిందే. అలా అని ప్రతి కొత్తనీ ఆహ్వానిస్తే అది ప్రమాదకరం కావొచ్చు. ఈ నిజాన్ని గుర్తెరిగి నడుచుకుంది ఈటీవీ. అందుకే ఈరోజుకీ సకుటుంబంగా చూడగల చక్కటి ఛానల్‌గా మీ మన్ననలు అందుకుంటోంది అని ఆయన అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios