ఒకప్పటి అగ్ర హీరోయిన్ శ్రీదేవి మరణం సినీ ప్రపంచాన్ని కుదిపేసింది. ఫిబ్రవరి నెల వస్తే ఆమె చనిపోయి ఏడాది పూర్తవుతుంది. ఇప్పటికీ చాలా మందిలో శ్రీదేవి డెత్ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.

అయితే ఇప్పుడు ఈ విషయాలను తెరపై దృశ్యరూపంలో చూపించడానికి సిద్ధమవుతున్నాడు ప్రముఖ నిర్మాత, శ్రీదేవి భర్త బోణీకపూర్. శ్రీదేవి బయోపిక్ కోసం సన్నాహాలు  జరుగుతున్నాయి. ప్రస్తుతం సినిమా స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నారు. కొందరు రచయితల ఆధ్వర్యంలో శ్రీదేవి బయోపిక్ స్క్రిప్ట్ సిద్ధమవుతోంది.

ఈ సినిమాను బోణీకపూర్ డైరెక్ట్ చేస్తాడని బాలీవుడ్ లో ప్రచారం జరుగుతున్నా.. ఓ మంచి దర్శకుడి చేతిలో ఈ సినిమా పెడితే న్యాయం జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కథలో శ్రీదేవి జీవితాన్ని సమగ్రంగా చూపించబోతున్నారని సమాచారం.

శ్రీదేవి ఎలా మరణించింది..? అసలు మరణించిన రోజు ఏం జరిగిందనే..? విషయాలను ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు  చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాతో పాటు శ్రీదేవి జీవితాన్ని పుస్తక రూపంలో కూడా తీసుకురావాలని భావిస్తున్నారు.