కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ చాలా రోజుల తరువాత ఒక ప్రయోగాత్మక కథతో రెడీ అయ్యాడు. మొన్నటివరకు కమర్షియల్ సినిమాలు చేసిన అజిత్ శ్రేదేవి కోరిక ప్రకారం బోణి కపూర్ ప్రొడక్షన్ లో ఒక సినిమాను చేశాడు. పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన 'నెర్కొండ పార్వాయ్' ఈ నెల 8న రిలీజ్ కాబోతోంది. 

ఈ సినిమా రిలీజ్ అవుతున్న సందర్బంగా బోణి కపూర్ శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.  అజిత్ తో ఒక సినిమాను నిర్మించాలని శ్రీదేవి ఎప్పటి నుంచో నాతో చెబుతూ వస్తోంది. మామ్ సినిమాలో అజిత్ గెస్ట్ రోల్ లో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడే  అజిత్ తో సినిమాని నిర్మించాలని బలంగా కోరుకుందని చెప్పారు. 

అజిత్ సహకారంతో శ్రీదేవి కోరిక ఇప్పుడు నెరవేరుతోందని వరల్డ్ వైడ్ గా నెర్కొండ పార్వాయ్' గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్నట్లు బోణి కపూర్ పేర్కొన్నారు. హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన నెర్కొండ పార్వాయ్ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. అజిత్ తో బోణి కపూర్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మరో బారి బడ్జెట్ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.