జాన్వి, ఖుషీలను ఏమీ అనొద్దంటున్న బోనీ మొదటి భార్య కూతురు అన్షులా

జాన్వి, ఖుషీలను ఏమీ అనొద్దంటున్న బోనీ మొదటి భార్య కూతురు అన్షులా

నటి శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ పై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బోనీ కపూర్ మొదటి భార్య కూతురు అన్షులా ఖండించారు. జాన్వీ, ఖుషీపై  అనుచిత వ్యాఖ్యలు చేసిన సదరు నెటిజన్ పై ఆమె మండిపడ్డార. శ్రీదేవి మరణానంతరం ఎంతో బాధలో ఉన్న జాన్వీ, ఖుషీలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ అన్షులా తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ పై చాలా మంది నెటిజన్లు పాజిటివ్ గా స్పందించారు. కానీ, ఓ నెటిజన్ మాత్రం జాన్వీ, ఖుషీలను దూషిస్తూ, అసభ్యపదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

 

దీంతో, తన చెల్లెళ్ల గురించి అలా మాట్లాడితే బాగుండదంటూ అన్షులా హెచ్చరించారు. ఆ తర్వాత ప్రశాంత మనసుతో ఆలోచించిన అన్షులా మరో పోస్ట్ చేశారు. ‘హాయ్, నా చెల్లెల్లపై అసభ్యపదజాలాన్నిప్రయోగించవద్దని వేడుకుంటున్నా. నేను ఏమాత్రం మిమ్మల్ని సమర్థించడం లేదు.. మీ కామెంట్స్ ను తొలగించేస్తున్నాను. అదే సమయంలో, నా పై, నా సోదరుడు (అర్జున్ కపూర్) పై చూపించిన ప్రేమాభిమానాలకు రుణపడి ఉంటాను...థ్యాంక్యూ ఫర్ ది లవ్’ అని అన్షులా తన పోస్ట్ లో పేర్కొంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos