సినిమా రంగంలో రాణించడం అంటే మామూలు విషయం కాదు. స్టార్ నటులుగా ఎదిగి కాస్ట్లీ కార్లు, అద్దాల మేడలో జీవించే అవకాశం అందరికి రాదు. ఇక టివి సీరియస్ లో నటించే నటుల పరిస్థితి కూడా అంతే. షూటింగ్ ఉన్నరోజు మాత్రమే డబ్బులు వస్తాయి.. లేకుంటే లేదు. చాలా మంది నటులు సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ ఉపాది కోసం మరో ఉద్యొగం చేస్తుంటారు. అలాంటి ఓ మహిళ అత్తారింటికి దారేది నటుడు బొమన్ ఇరానికి తారసపడింది. ఆమె గొప్పతనాన్ని బొమన్ ఇరాని సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. 

ఆటో నడుపుతున్న ఈ మహిళా పేరు లక్ష్మీ. పలు మరాఠి సీరియల్స్ లో నటిస్తోంది. పగలు షూటింగ్ లో పాల్గొని రాత్రి సమయంలో ఆటో నడుపుతూ ఉపాది పొందుతోంది. ఇటీవల బొమన్ ఇరాని ఆమెని చూసి ఆటో ఎక్కాడు. ' సూపర్ లేడి లక్ష్మీని కలిశాను. సీరియల్స్ లో నటిస్తూనే ఆటో డ్రైవర్ గా పనిచేస్తోంది. ఆమె మహిళలందరికీ ఆదర్శం అని బొమన్ ఇరాని ప్రశంసలు కురిపించారు. 

నిజజీవితంలో లక్ష్మీ హీరోగా ద్విపాత్రాభినయం చేస్తోంది. ఆమెని చూస్తుంటే గర్వంగా ఉంది అని బొమన్ ఇరానీ అన్నారు. ప్రస్తుతం లక్ష్మీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.