తండ్రి కాబోతున్న బాలీవుడ్ యంగ్ హీరో.. స్పందించిన సమంత ..?

 ప్రముఖ బాలీవుడ్ హీరో తండ్రి కాబోతున్నాడు. స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించిన ఆహీరో.. సోషల్ మీడియాపోస్ట్ ద్వారాతన ఆనందాన్ని పంచుకున్నాడు.  

Bollywood Young Hero Varun Dhawan Becoming Father Soon JMS

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. తాను త్వరలో తండ్రి కాబోతున్నట్టు ప్రకటించాడు.  నాన్న అని పిలిపించుకోబోతున్నారు. వరుణ్. ఈ విషయంలో తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు వరుణ్ దావన్. సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్, తన స్నేహితురాలు, గర్ల్ ఫ్రెండ్ అయిన నటాషా దలాల్ ని 2021 లో పెళ్ళాడాడు  వరుణ్ దావణ్. పెళ్లి తరువాత ఓమూడేళ్ల పాటు.. హ్యాపీగా ఎంజాయ్ చేసిన ఈ జంట.. తాజాగా తల్లీతండ్రులు కాబోతున్నారు. 

ఈ సెలబ్రిటీ కపుల్స్.. తమ లైఫ్ లోకి మొదటి బేబీకి వెల్కమ్ చెప్పబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో.. వరుణ్ దావణ్ సోషల్ మీడియాలోఓ పోస్ట్ పెట్టారు.  తన భార్య నటాషా బేబీ బంప్ కి ముద్దుపెడుతున్న ఫోటోను శేర్ చేశారు వరుణ్ దావణ్. ఈ విధంగా రాశారు..  “మేము తల్లిదండ్రులు కాబోతున్నాము. మాకు మీ అందరి ప్రేమ, అశీసులు కావాలి” అంటూ రాసుకొచ్చాడు యంగ్ హీరో.  ఇక ఈ పోస్టు పై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ స్పందిస్తున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా రియాక్ట్ అవుతున్నారు. సమంత స్పెషల్ గా వీరికి విషెస్ తెలియజేశారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by VarunDhawan (@varundvn)

బాలీవుడ్ స్టార్స్  రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అర్జున్ కపూర్, ప్రియాంక చోప్రా,కరీనా కపూర్,  అలియా భట్, సమంత, బిపాసా.. కియారా అద్వానీ,  లాంటి  స్టార్స్ అంతా వరుస కామెంట్స్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేసారు. ఇక వరుణ్ బాలీవుడ్ లో బిజీగా ఉన్నాడు. అట్లీ సినిమాలో నటిస్తున్నాడు వరుణ్. దాంతో పాటు   సిటాడెల్ వెబ్ సిరీస్ తో మరోసారి తెలుగువారిని పలకరించబోతున్నారు. సమంత, వరుణ్ ధావన్ లీడ్ రోల్స్ చేస్తున్న ఈ సిటాడెల్ సిరీస్.. షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సిరీస్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు.

అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ గా రూపొందుతున్న ఈ సిరీస్ హాలీవుడ్ వెర్షన్ లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆ సిరీస్ ఫస్ట్ సీజన్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఇండియన్ వెర్షన్ పై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇండియన్ ఆడియన్స్ కోసం ఇక్కడి కథలకు తగ్గట్టు రాజ్ అండ్ డీకే ఈ సినిమాని డైరెక్ట్ చేసారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios