బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ ఓ భారీ ఆఫర్ ను రిజక్ట్ చేశారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 9 కోట్ల ప్రాజెక్ట్ ను వద్దని వదిలేశారు. అంత మంచిఆఫర్ ను ఆయన ఎందకు వదిలేశారు..? కారణం ఏంటీ..? 

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక స్థాయికి వచ్చాక.. ఏదో ఒక ప్రాడెక్ట్ కు బ్రాండ్ అంబాసిడర్స్ గా మారడం కామన్. సినిమాలకంటే.. ప్యాపార కంపెనీల నుంచే. కోట్లలో సంపాదిస్తుంటారు. కాని కొంత మంది స్టార్స్ మాత్రం వాటివైపు కూడా చూడరు. మరికొంత మంది మాత్రం కొన్ని యాడ్స్ ను నిర్థాక్షణ్యంగా రిజెక్ట్ చేస్తుంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కూడా ఒకరు. 

రీసెంట్ గా కార్తీక్ ఆర్యన్ కూడా ఒక వ్యాపార ప్రకటనకు నో చెప్పాడు. గతంలో ఇలా చాలా మంది చేశారు. కోట్ల రూపాయల ఆఫర్‌ వచ్చిన పొగాకు కంపెనీ ప్రకటనకి నో చెప్పాడు అల్లు అర్జున్‌. ఫెయిర్ నెస్ క్రీమ్ ప్రమోట్ చేయాలని భారీ మొత్తంలో ఆఫర్ వచ్చినా.. అభిమానులను మోసం చేయడం ఇష్టం లేక రిజక్ట్‌ చేసింది సాయి పల్లవి. తాజాగా అదే బాటలో నడిచాడు బాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌. పాన్‌ మసాల యాడ్‌ కోసం తన దగ్గరకు వచ్చిన 9 కోట్ల డీల్‌ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించాడట. 

స్టార్ హీరోలు అంటే జనాలకు మంచి జరిగేవే చెప్పాలి. చాలా మంది హీరోలను ఆదర్శంగా తీసుకుని వారు చేసే పనులే చేయడాని ఇష్టపడుతుంటారు. అలాంటిది హీరోలు పాన్ మసాలాలు తింటున్నారు అని తెలిస్తే.. యూత్ అంతా చెడిపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రజల ఆరోగ్యానికి హానీ కలిగించే ఉత్పత్తులను తాను ప్రమోషన్‌ చేయలేనని కార్తీక్ ఆర్యన్ చెప్పేశాడట. ఇంతకు ముందు కూడా అంతే.. బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, షారూఖ్ ఖాన్ ఇలా స్టార్ హీరోలు పొగాకు ప్రకటనల్లో నటించి... నెటిజన్ల కోపానికి గురయ్యారు. దాంతో అక్షయ్ తన ఫ్యాన్స్ కు సారీ కూడా చెప్పారు. 

బిజినెస్ మంచి ఊపు అందుకోవాలి అంటే.. తమ ప్రాడెక్ట్ కు మంచి పబ్లిసిటీ కావాలి. అందుకోసం స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు సెలబ్రిటీలతో వ్యాపార ప్రకటనలు చేయించడం కామన్. దీని కోసం భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ చెల్లిస్తాయి. అందుకే స్టార్‌ హీరో ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు కోట్లు కురిపించే యాడ్స్‌లో నటిస్తుంటారు.అయితే ఇక్కడ కొందరు హీరోలు రెమ్యూనరేషన్ ను బట్టి .. ఏ బ్రాండ్ ప్రమోషన్‌కి అయినా.. ఒకే చెపుతారు.. మరికొందరు మాత్రం డబ్బుని చూడకుండా.. ఆదర్శంగా ఉండటానికి చూస్తారు. ప్రజలకు హాని కలిగించని ఉత్పత్తులకు మాత్రమే బ్రాండ్స్ గా ఉంటారు. అలానే కార్తిక్ ఆర్యన్ కూడా ఆలోచించాడు.