Asianet News TeluguAsianet News Telugu

యనిమల్ సినిమా సమాజానికి ప్రమాదకరం, ప్రముఖ రచయిత సంచలన వ్యాఖ్యలు

ఆనిమల్ మూవీపై సంచలనాలు ఇంకా తగ్గడం లేదు. రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతున్నా.. ఈమూవీపై డైరెక్ట్ గా.. ఇండైరెక్టర్ గా కాంట్రవర్షియల్ కామెంట్స్ తప్పడంలేదు. 
 

Bollywood Writer Javed Akhtar Sensational Comments about Animal Movie JMS
Author
First Published Jan 7, 2024, 1:58 PM IST


యానిమల్ సినిమా ఇండియా అంతట ఎంత సంచలనంగా మారిందో తెలిసిందే. యూత్ ఈసినిమాకు బాగా అట్రాక్ట్ అయ్యారు. సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈమూవీ.. అతను చేసిన అర్జున్ రెడ్డిని మించి ఎలివేట్ అయ్యింది. అయితే ఈసినిమా పై అంతే ఎక్కువగా విమర్షలు కూడా వచ్చాయి. అసలు మనుషులు అనేవారు ఈసినిమా చూస్తారా అని చాలా మంది ముఖం మీదే అన్నారు. అంతెందుకు ఈ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా.. చిన్న పిల్లలు, గర్బిణులు ఈసినిమా చూడకండి అని చెప్పాడంటే.. యానిమల్ మూవీ గురించి ఇంతకన్న పెద్ద కామెంట్ ఇంకొకటి ఉండదు. 

ఇక ఈసినిమాపై విమర్షల దాడి ఇంకా తగ్గలేదు. సినిమా పెద్దలు కూడా ఇండైరెక్ట్ గా ఈ సినిమాను విమర్షిస్తున్నారు. ఈక్రమంలో బాలీవుడ్ స్టార్ సీనియర్ రైటర్ జావేద్ అక్తర్ కూడా ఈసినిమాపై డిఫరెంట్ కామెంట్స్ చేశారు.   ఎలాంటి సినిమాలు రావాలనేది నిర్ణయించాల్సింది ప్రేక్షకులేనని అన్నారు జావేద్ అక్తర్. ఇటీవల బ్లాక్ బస్టర్ గా నిలిచిన యానిమల్ సినిమాను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సినిమాలు భారీ విజయాన్ని నమోదు చేయడం ప్రమాదకరమని చెప్పారు. కొన్ని సినిమాలు సమాజానికి ఎంత ప్రమాదకరమో తెలుపుతూ ఆయన ఓ ఉదాహరణ కూడా చెప్పారు. 

యానిమల్ సినిమాలోని ఓ సన్నివేశాన్నిజావెడ్ గుర్తు చేశారు. హీరో తన ప్రేమను నిరూపించుకోవడానికి హీరోయిన్ ను బూట్లు నాకాలని అడగడం, మహిళలను చెంపదెబ్బ కొట్టడం సరైనదే అని చూపిండం వంటివి  ఉన్నప్పటికీ ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం.. మన సమాజం ఎటు వెళ్తుందో చూపించడానికి ఉదాహరణ అన్నారు. అందుకే ఆడియన్స్ ఇటువంటి సినిమాలు ఆదరిస్తే.. నెక్ట్స్ సమాజం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అన్నారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలను అనడం కంటే.. సినిమా చూసే ప్రేక్షకులకే ఎక్కువ బాధ్యత ఉందని జావేద్ అక్తర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నిర్మాతలు ఎలాంటి సినిమాలు తీయాలనేది ప్రేక్షకులు ఆదరించే జానర్ ను బట్ట ఉంటుందన్నారు.  సినిమాలలో చూపించే విలువలు, నైతికతను గమనించి వాటిని ఆదరించాలా లేక తిరస్కరించాలా అనేది.. ఆడియన్స్ ఒక్క సారి మనసులో ఆలోచించుకోవాలని హితవు పలికారు. 

ఇలాంటి సినిమాలు పెరిగిపోతే..నెక్ట్స్ జనరేషన్ ఎలాంటి ప్రమాదంలో పడుతుందో కూడా ఆలోచించాలన్నారు జావేద్. అంతే కాదు.. ప్రస్తుతం సినీ రచయితలు సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, స్క్రీన్ పై ఎలాంటి హీరోను నిలబెట్టాలని మదనపడుతున్నారని చెప్పారు. గతంలో ధనవంతులను చెడుగా, పేద వాళ్లను మంచివాళ్లుగా సినిమాలలో చూపించేవారని అక్తర్ గుర్తుచేశారు. మారిన పరిస్థితులలో పేద వాళ్లు కూడా ధనవంతులుగా మారుతున్నారని, దీంతో ధనవంతులను చెడుగా చూపించే పరిస్థితి ప్రస్తుతం లేదని ఆయన పేర్కొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios