మెగా స్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నెంబర్ 150 భారీ సక్సెస్ సాధించాక.. చిరంజీవి తన 151వ చిత్రంపైనా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ నను హీరోయిన్ గా అనుకున్నా.. డేట్స్, రెమ్యునరేషన్ తదితర అంశాలు కుదరకపోవడంతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రంలో హీరోయిన్ గా నయనతారను ఎంపిక చేసినట్లు సమాచారం.

 

స్టైలిష్ డైరెక్టర్ సురెందర్ రెడ్డి దర్శకత్వంల వహిస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడడ్డి చిత్రంలో.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఓ కీలకపాత్రలో నటించనున్నారని సమాచారం. ఇపప్పటికే దీనికి సంబంధించిన చర్చలు సఫలమయ్యాయని, అమితాబ్ చిరంజీవి చిత్రంలో నటించేందుకు అంగీకరించారని సమాచారం. అయితే చిరు 151ను నిర్మిస్తున్న రామ్ చరణ్ నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ హౌజ్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది.

 

ఇక స్వాతంత్రోద్యమంలో భాగంగా 1847లో ఉరి తీయబడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా.. తెరకెక్కనున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రంలో... భారీ గ్రాఫిక్స్ కూడా ప్లాన్ చేసి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో అమితాబ్, చిరు 151లలో నటిస్తే అది చాలా ప్లస్ అవుతుందని అంచనాలున్నాయి.