రకుల్ ప్రీన్ సింగ్ పెళ్లిలో.. శిల్పా శెట్టి డాన్స్.. వింటానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా..? చూడటానికి ఇంత కంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తాజాగా వైరల్అవుతుంది ఈవీడియో..  

దాదాపు నాలుగైదేళ్లుగా బాలీవుడ్ నటుడు, ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో డేటింగ్ లో ఉంది రకుల్ ప్రీత్ సింగ్. ఎట్టకేలకు ఈ ఏడాది పెళ్లి చేసుకుంది. నిన్న (21 పిబ్రవరి) లో వీరి పెళ్లి గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లికి సంబంధించి రకరకాల వార్తలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్ నుంచి చాలా మంది స్టార్స్ వీరి పెళ్లిలో సందడి చేశారు.

రకుల్ ప్రీత్ , జాకీ భగ్నానీ పెళ్లి కి సబంధించిన వీడియోలు,ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా .. సంగీత్ షోలో ప్రముఖులు డ్యాన్స్ చేసినప్పుడు తీసిన వీడియోలు ఎప్పటికప్పుడు విడుదల అవుతున్నాయి. ముఖ్యంగా వివాహానికి ముందు జరిగే మెహందీ, సంగీత్ చాలా ఘనంగా జరిగింది. ఇందులో బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని రకుల్-జాకీ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ వేదికపై డ్యాన్స్ చేసి సంబరాలు చేసుకున్నారు.

View post on Instagram

అందులో ఈ వెంట్ కు ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు బాలీవుడ్ నటి శిల్పాశెట్టి. తన భర్త రాజ్ కుంద్రాతో కలిసి స్పెషల్ డ్యాన్స్ వేసింది. అక్కడి వేదికపై శిల్పా శెట్టి డాన్స్ అందరిని అలరించింది. బ్లక్ డ్రస్ లో మెరిసిపోయిన ఈ జంట చాలా స్టైలిష్‌గా మరియు రొమాంటిక్‌గా డ్యాన్స్ చేశారు. ఇక ఈ డాన్స్ కు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.