Asianet News TeluguAsianet News Telugu

సల్మాన్ ఖాన్ తో కలిసి స్టెప్పులేసిన అక్షయ్ కుమార్.. డాన్స్ అదరగొట్టిన బాలీవుడ్ స్టార్స్

బాలీవుడ్ స్టార్స్ ఇద్దరు కాలు కదిపారు.. కండల వీరుడు సల్మాన్ ఖాన్.. స్టార్ హీరో అక్షయ్ కుమార్ కలిసి ఇన్ స్టా రీల్స్ కు డాన్స్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. 
 

Bollywood Star Salman Khan Dance With Akshay Kumar
Author
First Published Feb 5, 2023, 3:47 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వరుస సినిమాలు చేస్తున్నాడు. గెలుపోటములకు సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అక్షయ్ నటించిన తాజా మూవీ సెల్ఫీ. రిలీజ్ కు రెడీగా ఉన్న ఈసినిమా ప్రమోషన్స్ ను జోరుగా చేస్తున్నాడు అక్షయ్ కుమార్. మూవీ ప్రమోషన్స్ మొత్తం తన భుజాలు మీద వేసుకుని చేస్తున్నాడు. ఈక్రమంలోనే ఆయన చేసిన ఓ పర్పామెన్స్ వైరల్ అవుతోంది. 

కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో కలిసి ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ చేసి పోస్ట్ చేశాడు అక్షయ్ కుమార్. బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. గట్టి దెబ్బ తగలడంతో.. ఇండస్ట్రీని బాగుచేసుకునే ప్రయత్నంలో పడ్డారు స్టార్స్. అందుకే ఒకరి సినిమాకు మరొకరు సాయం చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఈక్రమంలోనే అక్షయ్ కుమార్ సెల్ఫీసినిమాకు  సల్మాన్ ఖాన్ సాయం అందించాడు. 

ఈ వీడియోలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి హిట్ పాటకి స్టెప్పులు వేస్తుంటే.. అది చూసిన ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ తోపాటు ఇండస్ట్రీ వారు కూడా ముచ్చటపడుతున్నారు.  ఈ రీల్ పోస్ట్ చేస్తూ అక్షయ్ కుమార్ చిన్న నోట్ కూడా రాశారు. సల్మాన్ భాయ్ స్టెప్స్ ని చూసి క్షణాల్లో దాని రీ క్రియేట్ చేశాడు.. అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా సెల్ఫీ మూవీ  మలయాళంలో సూపర్ హిట్  డ్రైవింగ్ లైసెన్స్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుంది. మలయాళంలో  హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఈ సినిమాని తెరకెక్కించాడు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీలో సల్మాన్ ఖాన్ అతిధి పాత్ర చేసి సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అయ్యాడు. ఇప్పుడు అక్షయ్ కుమార్ సినిమాకు కూడా సాయం చేసి.. బాలీవుడ్ ను నిలబెట్టే పనిలో పడ్డాడు సల్మాన్. అక్షయ్ కుమార్ నటిస్తున్న సెల్ఫీ మూవీ రిలీజ్ కు రెడీగా ఉది.  ఈ నెల 24న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

అక్షయ్ గత నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేక పోయాయి. ఈ సినిమాతో ఎలా అయిన హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు. దీంతో మూవీ ప్రమోషన్స్ మొత్తం తన భుజాలు మీద వేసుకున్నాడు. ఈ క్రమంలోనే కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో కలిసి ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ చేసి పోస్ట్ చేశాడు. తన పాత సినిమాలోని మే ఖిలాడి తు అనారీకి పాటని ఈ మూవీలో రీమేక్ చేస్తున్నాడు. ఆ పాటకి సల్మాన్ తో కలిసి అక్షయ్ ఒక రీల్ చేసి పోస్ట్ చేశాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios