Asianet News TeluguAsianet News Telugu

ఎంఎస్‌ ధోనీ కి ముద్దు పెట్టిన రణ్ వీర్ సింగ్, ఇదేంపని అంటున్న నెటిజన్లు..

టీమ్ ఇండియన్ మాజీ కెప్టెన్ ఎం ఎస్ ధోనీని ఘాడంగా ముద్దు పెట్టాటు బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్. అదేంటి ధోనీకి  రణ్ వీర్ సింగ్ ముద్దుపెట్టడం ఏంటీ.. చిత్రంగా ఉంది కదూ.. అసలు విషయం ఏంటంటే..? 
 

Bollywood Star Ranveer Singh Kisses Cricketer MS Dhoni JMS
Author
First Published Oct 5, 2023, 7:04 PM IST

టీమ్ ఇండియన్ మాజీ కెప్టెన్ ఎం ఎస్ ధోనీని ఘాడంగా ముద్దు పెట్టాటు బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్. అదేంటి ధోనీకి  రణ్ వీర్ సింగ్ ముద్దుపెట్టడం ఏంటీ.. చిత్రంగా ఉంది కదూ.. అసలు విషయం ఏంటంటే..? 

టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్, క్రికెటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ (MS Dhoni)ని బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh) కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరూ చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఈమధ్యనే థోనీ సినిమా రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇక ఈక్రంమలో వీరు కలవడం పెద్ద టాపిక్ అయ్యింది బాలీవుడ్ లో . ఈ క్రమంలో ధోనీ బుగ్గపై రణ్‌వీర్‌ ముద్దు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. 

 

అయితే వీరి మీటింగ్స్ కు సబంధించిన ఫోటోలు బాలీవుడ్  రణ్‌వీర్‌ సింగ్ ఇన్‌స్టా వేదికగా పోస్టు చేశారు. అంతే కాదు ఈ ఫొటోలకు మేరే మహీ.. అంటూ క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో  వైరల్‌ అవుతున్నాయి. కాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా యాక్టీవ్ అవుతున్న మహేంద్ర సింగ్ థోనీ.. సినిమా స్థార్స్ తో అనుబంధం పెంచుకుంటున్నారు. ఆమధ్య టాలీవుడ్‌ స్టార్‌ హీరో రామ్‌చరణ్‌ (Ram Charan) కూడా మహీని కలిసిన విషయం తెలిసిందే. బుధవారం ముంబైలో ధోనీని కలిశారు. వీరిద్దరూ ఒక యాడ్ షూట్ కోసం క‌లుసుకున్నట్లు తెలిసింది. 

మ‌రోవైపు ధోనీ కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు.  స్టయిలిష్‌ లుక్‌తో అభిమానుల్ని అట్రాక్ట్ చేస్తున్నాడు. అటుహెయిర్ స్టైల్ తో పాటు.. ఫేస్ లో కూడా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. కెరీర్ బిగినింగ్ లో జుంపాలతో.. పెద్ద పెద్ద జుట్టు కలిగి.. కొత్త  హెయిర్ స్టయిల్‌తో కిక్ ఇచ్చిన ధోనీ, మ‌ళ్లీ ఇప్పుడు దాదాపు అలాంటి హెయిర్ స్టయిల్‌తో ఆకట్టుకుంటున్నాడు. యాడ్ షూట్ కోసమే ధోనీ ఇలా కొత్త లుక్‌కు మారినట్లు తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios