బాలీవుడ్ స్టార్ సీనియర్ హీర అమీర్ ఖాన్ పై తన స్టైల్ లో ఫైర్ అయ్యింది.. స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్. ఇంతకీ అమీర్ ఖాన్ పై ఆమెకు అంత కోపంఎందుకు వచ్చింది.  

బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న నటి కంగనా రనౌత్. ఎవరూ.. ఏంటీ.. అనేది కూడాచూసుకోకుండా.. ఎదరు నిలబడి పోరాటం చేయడంలో.. పేరున్న నటి. తన అద్భతమైన నటనతో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతోంది కంగన. అటు నటన పరంగానే కాకుండా ఇటు వివాదాల పరంగా కూడా ఎక్కడా తగ్గేదే లేదన్నట్టు దూసుకుపోతోంది. బాలీవుడ్ లో పెద్ద పెద్ద వ్యావస్థలను ఎదురించి నిలిచిన నటి కంగనా రనౌత్. తప్పు జరిగిందంటే నిలబెట్టి కడిగేస్తుంది కంగనా. అంతే కాదు సోషల్ మీడియా ద్వారా బాలీవుడ్ తో పాటు.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలపై స్పందిస్తుంటుంది బ్యూటీ. 

ఇక నటనతో నే కాకుండా వివాదాలతో కూడా తరచు వార్తల్లో నిలుస్తుంటుంది కంగనా రనౌత్. ఇక రీసెంట్ గా ఆమె మరో వివాదంతో ముందకు వచ్చింది. మరోసారి వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ సూపర్ స్టార్, మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఆమిర్ ఖాన్ పై వెటకారపు డైలాగ్స్ సంధించింది ఫైర్ బ్రాండ్ కంగనా. ఆమిర్ ఖాన్ పై తనదైన శైలిలో విరుచుకుపడింది కంగనా. ఇంతకీఅమీర్ పై ఆమెకు కోపం ఎందుకు వచ్చిందంటే..? 

వివరాల్లోకి వెళితే.. తాజాగా ఆమిర్ ఖాన్ ప్రముఖ రచయిత్రి శోభా డే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో తన బయోపిక్ ను తీసే నా పాత్రకు ఏ హీరోయిన్ సరిపోతుంది అని శోభా ఆమిర్ ను ప్రశ్నించింది. దానికి ఆమిర్.. ఆలియా భట్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె పేర్లను చెప్పాడు. వెంటనే శోభా.. మీరు కంగనా పేరును మర్చిపోయారు అని గుర్తు చేసింది.

దాంతో వెంటనే ఆమిర్ ఖాన్ తడబడి.. అవును కంగనా కూడా చాలా బాగా నటిస్తుంది. స్ట్రాంగ్ యాక్టర్ అని ప్రశంసించాడు. ఈ వీడియోను ఓ నెటిజన్ షేర్ చేయగా.. ఈ వీడియోపై స్పందించింది కంగనా. పాపం ఆమిర్ ఖాన్ నా పేరును చెప్పకుండా ఉండటానికి చాలా కష్టపడ్డాడు అంటూ వెటకారంగా డైలాగ్స్ విసిరింది బ్యూటీ. . ఇక ఆమిర్ చెప్పిన ఏ నటి కూడా ఒక్కసారి కూడా జాతీయ పురస్కారం గెలవలేదని ఈ సందర్భంగా కంగనా పేర్కొంది. నాలుగు జాతీయ అవార్డులు గెలుచుకున్న నన్ను ఆమిర్ ఖాన్ మర్చిపోయారు అని తెలిపింది. 

చాలా రోజుల తరువాత బాలీవుడ్ కు పఠాన్ సినిమాతో మంచి హిట్ దొరికింది. ఈక్రమంలో కొన్ని రోజుల క్రితం షారుఖ్ పఠాన్ సినిమా గురించి మంచిగా మాట్లాడి ఇండస్ట్రీని ఆశ్చర్య పరిచింది కంగనా రనౌత్. ఇక మళ్లీ ఇప్పుడు తన మాటల తూటాలు వదిలింది. ఈ సారి ఏకంగా బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఆమిర్ ఖాన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి.