బాలయ్య అన్ స్టాపబుల్ కు బాలీవుడ్ హీరో.. రష్మికతో పాటు రాబోతున్నాడట.
బాలయ్య బాబు హోస్ట్ గా అన్ స్టాపబుల్ రెండుసీజన్లు ఎంత గ్రాండ్ గా సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇంత వరకూ అన్ స్టాపబుల్ కు టాలీవుడ్ స్టార్స్ మాత్రమే వచ్చారు. ఇక అన్ స్టాపబుల్ సీజన్ 3 లో ఫస్ట్ టైమ్ బాలీవుడ్ స్టార్స్ సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది.

బాలయ్య బాబు యాంకర్ గా అన్ స్టాపబుల్ రెండు సీజన్లు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి. ఈరెండు సీజన్లలో సినీ, రాజకీయ ప్రముఖుల గురించి చాలా సీక్రేట్లు విప్పాడు బాలయ్య, చిన్నపిల్లాడి మాదిరి మారిపోయి.. తెగ అల్లరి చేశాడు. రెండుసీజన్లలో ఎంతో మంది సెలబ్రిటీల గురించి కొన్నికొత్త కోణాలు చూశారు ఆడియర్స్. ఈక్రమంలో అన్ స్టాపబుల్ మూడో సీజన్ ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.
ఈక్రమంలో బాలయ్య బాబు సినిమాలతో పాటు రాజకీయంగా బిజీ అవ్వడంతో.. అన్ స్టాపబుల్ సీజన్ 3 అనకున్నదానికంటే కాస్త డిలే అవుతూ వస్తోంది. ఈక్రమంలో తాజాగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా టీమ్ కోసం అన్ స్టాపబుల్ సీజన్ 3 స్టార్ట్ చేసి.. అందులో తన టీమ్ తో అల్లరి చేశాడు బాలయ్య.. ఇక ఈ సీజన్ ను ఇలానే కొనసాగించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే నెక్ట్స్ ఎపిసోడ్ లోకి ఎవరు గెస్ట్ లుగా రాబోతున్నారు అనేది ఉత్కంటగా మారిన క్రమంలో.. ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. అన్ స్టాపబుల్ సీజన్ 3 లో నెక్ట్స్ ఎపిసోడ్ కు అతిధులుగా బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ రాబోతున్నాడట. రష్మిక మందన్న కూడా ఈ ఈవెంట్ లో సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది. రణ్ బీర్,రష్మిక జంటగా నటించిన యానిమల్ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ కు రెడీగా ఉంది. ఈక్రమంలో ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా టీమ్ సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈసినిమాకు తెలుగు దర్శకుడు.. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేశారు. ఈక్రంలో ఈ వెంట్ లో ఆయన కూడా కనిపించబోతున్నట్టు సమాచారం.
బాలయ్య హోస్టింగ్ అంటేమాటలు కాదు.. అందులోను బాలీవుడ్ హీరో... యానిమల్ మూవీ... బాలకృష్ణకు ఎంతో ఇష్టమైన రష్మిక మందన్న కూడా రాబోతుండటంతో.. ఈ ఎపిసోడ్ పై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి ఈ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి.