లగ్జరీ కారు కొన్న ‘ఆర్ఆర్ఆర్’ స్టార్ అజయ్ దేవగన్.. ఖరీదు, కారు ఫీచర్స్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..
‘ఆర్ఆర్ఆర్‘తో అజయ్ దేవగన్ తెలుగు ప్రేక్షకులకు పవర్ ఫుల్ రోల్ లో అలరించారు. అయితే, తాజాగా బాలీవుడ్ స్టార్ కు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఓ కాస్ట్లీ కారు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్, RRR నటుడు అజయ్ దేవగన్ (Ajay Devgn) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. హిందీ ఇండస్ట్రీలో ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. 1991 నుంచి చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. ఇటీవల సౌత్ చిత్రాలపై ఆసక్తి చూపుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో కీలక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకుంటున్నారు. అలాగే సౌత్ మూవీ ‘ఖైదీ’ని హిందీలోనూ రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు.
అయితే అజయ్ దేవగన్ గురించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. బాలీవుడ్ స్టార్ ఓ ఖరీదైన కారు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. దాని ఖరీదు దాదాపు రూ. 1.95 కోట్ల (ఎక్స్ షోరూమ్) విలువ ఉంటుందని టాక్. బిఎమ్‌డబ్ల్యూ ఐ7 లగ్జరీ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ BMW i7 ఎలక్ట్రిక్ కారు జర్మన్ ఆటోమేకర్ లైనప్‌లో అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి అని తెలుస్తోంది. కారు ఫీచర్స్ కూడా అదిరిపోయేలా ఉన్నాయి. ఇన్ని కోట్ల ఖరీదు పెట్టి అజయ్ దేవగన్ కారు కొనుగులు చేయడంతో విషయం తెలుసుకున్న వారు ఆశ్చర్యపోతున్నారు.
కాగా, బాలీవుడ్ సెలబ్రిటీలు తమ లగ్జరీ కార్ల కలెక్షన్‌ను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తుంటారు. ఇది చాలా సాధారణం. ఈ క్రమంలో అజయ్ దేవగన్ కూడా దాదాపు రూ.2 కోట్ల విలువ గల కొత్త BMW i7 ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇప్పటికే ఇలాంటి కార్లను రితీష్ దేశ్‌ముఖ్, పూజా బాత్రా, మాధురీ దీక్షిత్, మందిరా బేడీ, మహేష్ బాబు మరియు ఇతర నటులు కొనుగోలు చేశారు. అయితే వీరిలో రితీష్ దేశ్‌ముఖ్, అజయ్ దేవగన్ కొనుగోలు చేసిన BMW చాలా లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాలు అని తెలుస్తోంది.
BMW i7 కారు ఫీచర్స్ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. కొత్త డిజైన్ లాంగ్వేజ్, కిడ్నీ-ఆకారంలో గ్రిల్డ్ అప్ ఫ్రంట్, సొగసైన LED లైట్లను కలిగి ఉంది. ఇండియన్ మార్కెట్లో ఈ కారు బ్లాక్ సఫైర్ మెటాలిక్ గా అందుబాటులో ఉంది. అలాగే ఇండివిజువల్ ద్రవిట్ గ్రే మెటాలిక్, ఇండివిజువల్ టాంజానైట్ బ్లూ మెటాలిక్, బ్రూక్లిన్ గ్రే మెటాలిక్, కార్బన్ బ్లాక్ మెటాలిక్, మినరల్ వైట్ మెటాలిక్, ఆక్సైడ్ గ్రే మెటాలిక్ వంటి కలర్స్ లో మార్కెట్లలో ఉంది. అయితే అజయ్ దేవగన్ కార్ల కలెక్షన్లలో ఈ కారే అత్యంత ఖరీదుగా తెలుస్తోంది. విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయి. ఈ BMW i7 పూర్తి-వెడల్పు లైట్ బ్యాండ్‌తో వస్తుంది. BMW నుండి తాజా iDrive 8 సాఫ్ట్‌వేర్ ఉంటుంది. అలాగే i7 పైకప్పు అమెజాన్ ఫైర్ టీవీ ద్వారా మీడియా స్ట్రీమింగ్ కోసం ఫోల్డబుల్ 31.3-అంగుళాల, 8K "సినిమా" స్క్రీన్ అమర్చారు. టచ్‌స్క్రీన్ సీట్లు, కంఫర్ట్ సిట్టింగ్ ను కలిగించేలా కారు ఫీచర్స్ ఉన్నాయి. ఇక ఈ కారు గరిష్ట వేగం 239 కి.మీ కాగా, 4.7 సెకన్లలోపు 100 కి.మీలోపు వేగాన్ని పుంజుకుంటుంది.