దొంగలాగా ముసుగేసుకుని పారిపోయింది.. బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్. ఓ కేసులో లొంగిపోయిన ఆమె.. మీడియా కంటపడకుండా జగ్రత్త పడింది. 

బాలీవుడ్ హీరోయిన్లపై ఈమధ్య ఎక్కువగా కేసులు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా చెక్‌ బౌన్స్‌ కేసులో చాలా మంది హీరోయిన్లు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈక్రమంలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్.. అమీషా పటేల్ కూడా ఓ కేసులో ఇరుక్కోవడమే కాదు.. కోర్టులో సరెండర్ అయ్యింది కూడా.ఈరోజు(17 జూన్) ఉదయం రాంచి సివిల్‌ కోర్టులో ఆమె లొంగిపోయింది. సినిమా నిర్మాత, వ్యాపారవేత్త అజయ్‌ కుమార్‌.. అమీషా పటేల్‌పై చెక్‌ బౌన్స్‌ కేసు వేశాడు. దాంతో ఆమె కోర్ట్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. 

గతంలో సినిమా నిర్మిస్తానంటూ అమీషా పటేల్ తన దగ్గర 2.5 కోట్లు అప్పుగా తీసుకున్నదని, ఆ తర్వాత ఆమె సినిమా పూర్తిచేయలేదని, తన డబ్బు తనకు తిరిగి ఇవ్వలేదని అజయ్‌కుమార్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. అసలు .2.5 కోట్లకు వడ్డీ 50 లక్షలు కలిపి మొత్తం .3 కోట్లు ఇప్పించాలని ఆయన కోర్టును కోరాడు.ఈ కేసు విచారణ చేసిన కోర్టు ఏప్రిల్‌ నెల 6న అమీషాకు వారెంట్‌ ఇష్యూ చేసింది. 

Scroll to load tweet…

ఈ నేపథ్యంలో ఆమె ఈఆరోజు కోర్టులో లొంగిపోయింది. అనంతరం కోర్టు ఆమె షరతులతో కూడిన బెయిల్‌ కూడా మంజూరు చేసింది. దాంతో కోర్టు బయటికి వచ్చిన ఆమె వెంటనే స్పీడ్ గా స్పందించి.. తలకు ముసుగు కప్పకుంది.. మీడియాను చూసి తలకు ముసుగు కప్పుకుంది. కోర్టులో ఏం జరిగిందో చెప్పమని మీడియా ప్రతినిధులు పదేపదే ప్రశ్నించినా ఆమె పట్టించుకోకుండా కారులోకి ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయింది.