బాలీవుడ్ కి మరో షాకింగ్ న్యూస్. హీరో అక్షయ్ కుమార్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ స్వయంగా తెలియజేశారు. సోషల్ మీడియా ద్వారా అక్షయ్ కుమార్ తనకు కరోనా సోకినట్లు చెప్పడం జరిగింది. '' మీ అందరికీ ఒక ముఖ్య సమాచారం. నేడు ఉదయం కరోనా టెస్ట్స్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీనితో క్వారంటైన్ కావడంతో పాటు, ఇంటి దగ్గరే చికిత్స తీసుకుంటున్నాను. అలాగే ఈమధ్య కాలంలో నన్ను కలిసి ప్రతి ఒక్కరు కరోనా టెస్ట్స్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. త్వరలో కోలుకొని తిరిగి వస్తా... ధన్యవాదములు'' అని అక్షయ్ ట్వీట్ చేశారు. 

అరడజనుకు పైగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న అక్షయ్ కుమార్ కి కోవిడ్ సోకడంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మొదటిదశలో కోవిడ్ నుండి తప్పించుకున్న బాలీవుడ్ స్టార్స్, సెకండ్ వేవ్ లో వరుసగా కరోనా బారినపడడం ఆందోళన కలిగిస్తుంది. రన్బీర్ కపూర్, అలియా భట్, అమీర్ ఖాన్, సచిన్ వంటి ప్రముఖులకు రోజుల వ్యవధిలో కరోనా సోకింది. 


ఇక అక్షయ్ కుమార్ కు కరోనా నేపథ్యంలో ఆయన నటిస్తున్న అనేక చిత్రాల షూటింగ్స్ కి బ్రేక్ పడే అవకాశం కలదు. ఇటీవలే అక్షయ్ రామ సేతు చిత్ర షూటింగ్ లో పాల్గొనడం జరిగింది. అలాగే ధనుష్,  సారా అలీ ఖాన్ తో ఆయన చేస్తున్న అత్రాంగిరే షూటింగ్ కి సైతం అక్షయ్ హాజరు కావడం జరిగింది.  అక్షయ్ నటించిన బెల్ బాటమ్, సూర్యవంశీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.