వరుసగా ఆరు చిత్రాలు ఫ్లాప్.. ఆ తప్పు నాదే.. అక్షయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) గతేడాది బ్యాక్ టు బ్యాక్ అర డజన్ చిత్రాలతో ఫ్యాన్స్ ను అలరించారు. అయితే అవన్నీ ఆశించిన మేర ఫలితాలనివ్వలేదు. దీనిపై తాజగా ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్, ఇండియన్ హీరోల్లో ఎక్కువ క్రేజ్ ఉన్న నటుడిగా దూకుపుతోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న అక్షయ్ కుమార్.. సినిమాల విషయంలో చాలా శ్రద్ధ వహిస్తుంటారు. చాలా త్వరగా ప్రాజెక్ట్స్ ను కంప్లీట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. గతేడాది వరుస ఫ్లాప్స్ ను మూటగట్టుకుంటున్నారు. ఈ క్రమంలోతాజాగా వచ్చిన చిత్రం ‘సెల్ఫీ’ కూడా ఆశించిన మేర ఫలితానివ్వలేదు. ఫిబ్రవరి 24న ఈ చిత్రం విడుదలైంది.
ప్రముఖ దర్శకుడు రాజ్ మెహతా డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం (Selfiee). 2019 మలయాళంలో వచ్చిన ‘డ్రైవింగ్ లైసెన్స్’కి రీమేక్ ఇది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ నటించిన మల్టీస్టారర్ సినిమా.. కామెడీ జోనర్ లో ఫిబ్రవరి 24న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ ధర్మ ప్రొడక్షన్స్, మ్యాజిక్ ఫ్రేమ్స్, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, స్టార్ స్టూడియోస్ సంయుక్థంగా నిర్మించాయి. చిత్ర ప్రమోషన్స్ నూ జోరుగా నిర్వహించినా.. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేదని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అయితే, అక్షయ్ కుమార్ ఇలా వరుస ఫ్లాప్స్ ను మూటగట్టుకోవడంపై ఆయనే ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘సెల్ఫీ’ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘సినిమాల విషయంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాను. ఒకానొక దశలో నేను నటించిన 16 చిత్రాలు ఆశించిన మేర ఫలితాలనివ్వలేదు. మరోసారి వరుసగా ఆరుకుపైగా చిత్రాలూ ఆశించిన స్థాయిలో సక్సెస్ ను అందించలేకపోయాయి. మూవీ హిట్ కావడం లేదంటే.. అది వందశాతం నా తప్పే అవుతుంది. ప్రేక్షకులు కొత్తదనం ఆశిస్తున్నారు. నేనూ దానికోసమే ప్రయత్నిస్తున్నాను. సినిమా హిట్ అవ్వకపోవడంలో నా తప్పే ఉంటుంది’ అంటూ అక్షయ్ చెప్పుకొచ్చారు. ఇక గతేడాది వచ్చినన ‘అత్రంగిరే, కట్ పత్లీ, బచ్చన్ పాండే, సామ్రాట్ ప్రుథ్వీరాజ్, రక్ష బందన్, రామ్ సేతు తో పాటు తాజాగా వచ్చిన ‘సెల్ఫీ’ చిత్రం కూడా ఫ్యాన్స్ ను నిరాశ పరిచింది. ఇదిలా ఉంటే..ప్రస్తుతం అక్షయ్ చేతిలో మరో అరడన్ చిత్రాలు ఉన్నాయి. వీటితోనైనా భారీ కంబ్యాక్ ఇస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.