ఓ వైపు పెళ్లి హడావుడితో రానా బిజీగా ఉన్నారు. ఇంతలో రానాపై బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఓ పిడుగులాంటి కామెంట్ చేశారు. పెద్ద సెటైరే వేశాడు. `శాశ్వతంగా లాక్డ్-డౌన్ కావడానికి ఇదే సరైన మార్గం. కంగ్రాట్స్ రానా.. మీరిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా` అని ట్విట్టర్ ద్వారా విశెష్ తెలిపాడు.
హీరో దగ్గుబాటి రానా బ్యాచ్‌లర్ లైఫ్‌కి ఫుల్‌స్టాప్ పెట్టబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన ఫ్యామిలీ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ శనివారం రాత్రి 8.30గంటలకు తాను ప్రేమించిన అమ్మాయి మిహీకా బజాజ్ మెడలో మూడుముళ్ళు వేయబోతున్నాడు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాటు సిద్ధమయ్యాయి. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ వివాహ వేడుక జరుగుతుంది. రానా ఫ్యామిలీ, మిహీకా ఫ్యామిలీ, నాగార్జున ఫ్యామిలీతోపాటు చిత్ర పరిశ్రమకు చెందిన అతికొద్ది మంది ముఖ్యులు మాత్రమే హాజరవుతున్నారు. మిగిలిన బంధువులు, సినీ ప్రముఖులు ఆన్‌లైన్ వర్చువల్ వీడియోలో పెళ్ళిని తిలకించేలా ఏర్పాట్లు చేశారు.
ఓ వైపు పెళ్లి హడావుడితో రానా బిజీగా ఉన్నారు. ఇంతలో రానాపై బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఓ పిడుగులాంటి కామెంట్ చేశారు. పెద్ద సెటైరే వేశాడు. `శాశ్వతంగా లాక్డ్-డౌన్ కావడానికి ఇదే సరైన మార్గం. కంగ్రాట్స్ రానా.. మీరిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా` అని ట్విట్టర్ ద్వారా విశెష్ తెలిపాడు. విశెష్ తెలపడం బాగానే ఉంది, `పర్మినెంట్ లాక్‌డౌన్` అనడమే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరికొద్ది సేపట్లో తాళి కట్టబోతున్న రానాపై అక్కీ ఇలాంటి కామెంట్ చేశాడేంటనే అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
జనరల్‌గా ఓ బ్యాచ్‌లర్ ఇంటివాడు కాబోతున్నాడంటే చాలు ఓ వైపు సంబరాలు నడుస్తుంటే.. మరోవైపు మనోడు బుక్ అవుతున్నాడు అని స్నేహితులు చేసే సరదా కామెంట్స్ వింటూ ఉంటాం. పెళ్ళైతే ఇక ఫ్రీడమ్ లైఫ్ కోల్పోతాం, హ్యాపీగా స్పెండ్ చేసే లోన్లీ టైమ్ మిస్ అవుతాం అనే కోణంలో ఇలాంటి కామెంట్స్ వినిపిస్తుంటాయి. అక్షయ్ కుమార్ మాత్రం కాస్త డిఫరెంట్ ట్వీట్ చేసి నెటిజన్లను ఓ రేంజ్‌లో ఆకర్షించారు. 'శాశ్వతంగా లాక్-డౌన్' అనే పదం సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అభిమానులు, నెటిజన్లు సైతం కామెంట్లతో రెచ్చిపోతున్నారు. దీంతో ఇది పెద్ద దుమారాన్నే రేపుతుందని చెప్పొచ్చు.
అయితే అక్షయ్ స్పందించడానికి ఓ రీజన్ ఉంది. అక్కీ నటించిన `బేబీ`, `హౌజ్‌ఫుల్ 4` చిత్రాల్లో రానా కూడా కీలక పాత్రలు పోషించారు. అక్కడ ఏర్పడిన అనుబంధం ఇప్పుడు సెటైర్లు వేసేంత వరకు వచ్చిందని చెప్పొచ్చు.
