Asianet News TeluguAsianet News Telugu

కోట్లు విలువచేసే కారు కొన్న.. బాలీవుడ్ సీరియల్ కిస్సర్.. కాస్ట్ ఎంతంటే..?

బాలీవుడ్ స్టార్లు ఈమధ్య ఏదో ఒక కాస్టీ ప్రాపర్టీస్ కొంటూ.. వైరల్ న్యూస్ అవుతున్నారు. ఈమధ్యే జాన్ అబ్రహం కోట్లు విలువచేసే కారుకొనగా.. తాజాగా బాలీవుడ్ రొమాంటిక్ హీరో కూడా ఓ కాస్ట్లీ కారువాడు అయ్యాడు.

Bollywood Serial Kisser Hero Imran Hashmi Buys Swanky Rolls Royce Ghost Car JMS
Author
First Published Jan 12, 2024, 12:05 PM IST


బాలీవుడ్ లో రొమాంటిక్ ఇమేజ్ తో పాటు..సీరియల్ కిస్సర్ గా పేరు తెచ్చుకున్నాడు హీరో  ఇమ్రాన్ హష్మీ. కాని ఈమధ్య చాలా చేంజ్ వచ్చింది ఇమ్రాన్ లో. రొమాంటిక్ పాత్రల నుంచి కంప్లీట్ గా టర్న్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఫ్యామిలీ మెన్ గా మారిపోయాడు ఇమ్రాన్.  అంతే కాదు విలన్ గా కూడా అవతారంఎత్తాడు ఇమ్రాన్. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3లో మెయిన్ విలన్ గా నటించి మెప్పించాడు. ఇక తాజాగా మరో సారి కంప్లీట్ గా విలన్ అవతారంలో కనిపించబోతున్నాడు స్టార్ హీరో. బాలీవుడ్ లో మరోసారి తన సత్తా చాటబోతున్నాడు. 

ఇక ఇంతకు ముందు కంటే ఎక్కువగా సినిమాలు చేస్తున్నాడు ఇమ్రాన్ హష్మీ. వరుసగా విలన్ పాత్రలకు ఎస్ చెప్పడం తో అతను చేసే సినిమాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అంతే కాదు  విలన్‌గా నటించడానికి భారీగానే వసూలు చేస్తున్నాడట బాలీవుడ్ హీరో.  దీంతో ఇమ్రాన్ ఇప్పుడు కాస్ట్లీ స్టార్ అయిపోయాడు. ఇక తాజాగా ఇమ్రాన్ అత్యంత ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. ఇమ్రాన్ హష్మీ రీసెంట్ రోల్స్ రాయిస్ అనే లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. అయితే ఇందులో విషేశం ఏంటంటే.. ఈకారు అతి కొద్ది మంది బాలీవుడ్ నటుల వద్ద మాత్రమే ఉంది.

 

ఇమ్రాన్ హష్మీ కొన్న కారు.. బాలీవుడ్ లో  అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ తోపాటు మరికొందరు బాలీవుడ్ నటులు, నిర్మాతల దగ్గర మాత్రమే ఉంది. ఇపపుడు వారి లిస్ట్ లో ఈ స్టార్ కూడా చేరిపోయాడు. ఇంకీ ఆ కారు ఏంటంటే.. కోట్ల రూపాయల విలువ చేసే రోల్స్ రాయిస్ ఘోస్ట్ బ్లాక్ బ్యాడ్జ్. అయితే గతంలోనే హిమ్రాన్ కు రోల్స్ రాయల్  కారు ఉంది. కాని ఈ కారుపై ఇష్టంతో.. ఇమ్రాన్ హష్మీ 12.25 కోట్లకు పైగా ఖర్చు పెట్టి కొనుగోలు చేశారు. అంతే కాదు ఈ కారులో అనేక లగ్జరీ ఫీచర్లు, సేఫ్టీ సిస్టమ్స్ ఉన్నాయి.

ఇక విలన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఇమ్రాన్.. సల్మాన్ ఖాన్ టైగర్3 సినిమాల్ సందడి చేశాడు. ఇక సౌత్ నుంచి రూడా అతనికి భారీగా ఆపర్లు వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఇమ్రాన్. వీటితో పాటు రణవీర్ సింగ్ ‘డాన్ 3’లో కూడా ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి ఫర్నాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios