ప్రముఖ హిందీ టీవీ నటి జరీనా రోషన్‌ ఖాన్‌(54) కన్నుమూశారు. గుండెపోటుతో ఆదివారం ఆమె తుదిశ్వాస విడిచారు. `కుంకుమ్‌ భాగ్య` సీరియల్‌తో నటిగా విశేష గుర్తింపు పొందన ఆమె అకాల మరణంలో బాలీవుడ్‌ సినీ, టీవీ వర్గాలు, పలువురు సెలబ్రిటీలు తీవ్ర దిగ్భాంత్రిని వ్యక్తం చేశారు. 

జరీనా రోషన్‌ ఖాన్‌ మరణంతో `కుంకుమ్‌ భాగ్య` సీరియల్‌ టీమ్‌ సైతం కన్నీళ్ళు పెట్టుకుంది. ఆమెతో అనుబంధాన్ని పంచుకుంటూ ఎమోషనల్‌ అయ్యారు. సోషల్‌ మీడియా వేదికగా ఆమెకి నివాళ్లర్పించారు. ఈ సీరియల్‌లో జరీనా.. ఇందూ దాది పాత్రలో నటించారు. సీరియల్‌ మాదిరిగానే ఈ పాత్ర కోసం బాగా ఫేమ్‌ అయ్యింది. ఆమె మరణంతో చలించిపోయిన టీవీ నటుడు షబీర్‌ అహ్లువాలియా, నటి శ్రీతి జాలు.. జారీనాతో కలిసి దిగిన ఫోటోలను పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ సంతాపం తెలిపారు. 

`మీది చంద్రుడి వలే ఎల్లప్పుడు ప్రకాశించే ముఖం` అని షబీర్‌ పేర్కొంటూ సంతాపం తెలపగా, నటి శద్ధ ఆర్య స్పందిస్తూ, జరీనా మృతి నన్ను షాక్‌కి గురి చేసిందని, ఈ విషయాన్ని నమ్మకలేకపోతున్నానని, ఆమె మరణం తీరని లోటని భావోద్వేగానికి గురయ్యారు. ఆమె బాలీవుడ్‌లోకి అడుగు పెట్టకముందు `కుంకుమ్ భాగ్య` లో నటించారని నటి మృణాల్‌ ఠాకూర్ అన్నారు. జరీనా కుంకుమ్‌ భాగ్యతో పాటు `యే రిష్టా క్యా కెహ్లతా`లో కూడా నటించారు. విన్‌ రానా, అనురాగ్‌ శర్మ వంటి సెలబ్రిటీలు ఆమెకి సోషల్‌ మీడియా ద్వారా సంతాపం తెలిపారు. జరీనా సీరియల్స్ తోపాటు బాలీవుడ్‌ సినిమాల్లో తల్లి పాత్రల్లో నటించి మెప్పించారు.

View this post on Instagram

💔...

A post shared by Sriti Jha (@itisriti) on Oct 18, 2020 at 9:21am PDT

View this post on Instagram

Ye chand sa Roshan Chehera 💔

A post shared by Shabir Ahluwalia (@shabirahluwalia) on Oct 18, 2020 at 9:07am PDT