Asianet News TeluguAsianet News Telugu

నన్ను హీరోని చేసింది తెలుగువారే.. ఆ డైరెక్టర్ కు రుణపడి ఉంటా.. అనిల్ కపూర్ కామెంట్స్..

నేను హీరోను అయ్యానంటే తెలుగువారి వల్లే. ఆ తెలుగు దర్శకుడే నన్ను హీరోని చేశాడు అంటూ.. సీక్రెట్ వెల్లడించాడు.. బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్. ఇంతకీ అనిల్ కపూర్ చెప్పిన విషయాల గురించి వివరాల్లోకి వెళ్తే.
 

Bollywood Senior Hero Anil Kapoor Comments about Telugu Audience JMS
Author
First Published Nov 28, 2023, 3:08 PM IST

బాలీవుడ్ తో పాటు.. తెలుగులో కూడా భారీ ఎత్తున రిలీజ్ కు ముస్తాబయ్యింది యానిమల్ సినిమా. బాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో.. రొమాంటిక్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా.. అర్జున్ రెడ్డి ఫేమ్..  సందీప్ వంగా దర్శకత్వంలో తెరెక్కిన సినిమా యానిమల్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సినిమా ప్రపంచ వ్యాప్తంగా  రిలీజ్ కు రెడీ అవుతోంది.  అండర్ వరల్డ్ డాన్ ప్లస్ ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యి భారీ అంచనాలు క్రియేట్ చేసింది. 

ఇక ఈ మూవీ ప్రమోషన్స్  మామూలుగా జరగలేదు. దీని కోసం భారీగా ఖర్చు కూడా పెట్టారు.  ఇందులో భాగంగా  హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కండక్ట్ చేశారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధులుగా మహేష్ బాబు, రాజమౌళి రాగా...  రణబీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్న, బాబీ డియోల్ తో పాటు  మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్ అంతా స్పెషల్ గా జరిగింది. ఆద్యంతం అలరించారు స్టార్లు. అంతే కాదు ఈ ఈవెంట్ లో  అనిల్ కపూర్ తెలుగులో మాట్లాడి అందర్నీ సర్‌ప్రైజ్ చేశారు. 

అనిల్ కపూర్ మాట్లాడుతూ.. నన్ను హీరో చేసింది తెలుగువారే. లెజెండరీ డైరెక్టర్ బాపు గారు నన్ను హీరోగా తెలుగు సినిమాతోనే పరిచయం చేశారు. ఆయన వలనే నేను నేడు నటుడిగా మీ ముందు ఇలా ఉన్నాను. మొదటి సినిమాతో ఇక్కడి ఆడియన్స్ ని పలకరించిన నేను.. మళ్ళీ 43 ఏళ్ళ తరువాత ఈ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. రష్మిక నీ లక్ నాకు కలిసి రావాలి. ఇన్నాళ్ల నా రీ ఎంట్రీకి నీ లక్ హెల్ప్ చేయాలి  అంటూ కామెంట్లు చేశారు. అనిల్ కపూర్ 1980లో బాపు దర్శకత్వంలో తెరకెక్కిన వంశ వృక్షం తెలుగు సినిమా  ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆయన కెరీర్ స్టార్ట్ చేసింది ఈసినిమాతోనే.

రాజమౌళి గురించి కూడా కామెంట్లు చేశారు అనిల్ కపూర్. జక్కన గురించి  మాట్లాడుతూ.. మీరు ఇండియన్ సినిమాని ఎక్కడికో తీసుకు వెళ్లారు. మీరు అన్ని ఇండస్ట్రీస్ ని ఒకటి చేశారు. మీలాంటి ఒక దర్శకుడు మాకు కావాలి. మీరు మరిన్ని గొప్ప సినిమాలు చేయాలనీ కోరుకుంటున్నాను అని అన్నారు.  అంతే కాదు మహేష్ బాబును కూడా వదలిపెట్టలేదు అనిల్ కపూర్.  మహేష్ బాబు, రణబీర్ కపూర్ ని స్టేజ్  మీదకి పిలిచి.. పోకిరి సినిమాలోని ‘డొలె డొలె’ సాంగ్ కు  డాన్స్ వేశారు అనిల్ కపూర్.  

Follow Us:
Download App:
  • android
  • ios