Asianet News TeluguAsianet News Telugu

రజినీ ‘జైలర్’ సెట్స్ లో బాలీవుడ్ సీనియర్ నటుడు.. అంచనాలు పెంచుతున్న లేటెస్ట్ పోస్టర్!

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) లేటెస్ట్ ఫిల్మ్ ‘జైలర్’. యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా తెరకెక్కుతోంది. శరవేగంగా షూటింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో లేటెస్ట్ అప్డేట్ తో సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు మేకర్స్.
 

Bollywood senior actor Jackie shroff joined in Jailer shooting
Author
First Published Feb 6, 2023, 1:42 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం  తమిళ దర్శకుడు నెల్సన్ కుమార్ డైరెక్షన్ లో నటిస్తున్నారు. నెల్సన్ చివరిగా తమిళ స్టార్ ఇళయదళపతి విజయ్ తో ‘బీస్ట్’ను తెరకెక్కించిన విషయం తెలిసిందే. నెల్సన్ చిత్రాలంటే బలమైన కథతోపాటు కామెడీ కూడా ఉంటుందనే విషయం తెలిసిందే. గత చిత్రాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం తలైవాతో నెల్సన్ (Nelson) ‘జైలర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. 

ఈ సందర్భంగా ‘జైలర్’ నటీనటులు ఒక్కొక్కరుగా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. చిత్రంలో రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యర్థిగా బలమైన పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ (Jackie Shroff)  నటిస్తున్నారు. అయితే జాకీ ష్రాఫ్ తాజాగా Jailer షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేకర్స్ ఆయన సెట్స్ లోని ఓ ఆసక్తికరమైన స్టిల్ ను అభిమానులతో పంచుకున్నారు. మాస్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు. ఒక్క స్టిల్ తో సినిమాపైనా అంచనాలు పెంచేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘జైలర్’ నుంచి అప్డేట్స్ అందుతుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

యాక్షన్ అండ్ కామెడీ జోనర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా నటించబోతున్నారని తెలుస్తోంది. మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఇప్పటికే ఫైనల్ అయ్యింది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా గెస్ట్ అపియరెన్స్ ఇవ్వబోతున్నారు.. మోహన్ లాల్ కామియోతో అలరించనున్నారు. రమ్యక్రిష్ణ, సునీల్, మోగిబాబు తదితులు ఆయా  పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి సినిమాటోగ్రఫీని విజయ్ కార్తీక్ కన్నన్, ఎడిటింగ్ ఆర్. నిర్మల్ అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios