టాలీవుడ్ లో సంచలన విజయాన్ని అందుకున్న ఆర్ఎక్స్ 100 సినిమా పరభాషా సినీ ప్రముఖులును కూడా బాగానే ఆకర్షించింది. మూడు కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఆ సినిమా 12 కోట్ల లాభాలను అందించడంతో బాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలు  పోటీ పడి మరి హక్కులను దక్కించుకున్నాయి. 

తమిళ్ లో ఆది పినిశెట్టి నటిస్తుండగా బాలీవుడ్ లో సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టి కథానాయకుడిగా సెలెక్ట్ అయ్యాడు. రీసెంట్ గా హీరోయిన్ తారా సితారియాని కూడా ఫైనల్ చేశారు. అయితే బాలీవుడ్ చిత్ర యూనిట్ కు ఇప్పుడు సినిమాను మొదలుపెట్టడానికి రెడీగా ఉండగా కొత్త సమస్య ఒకటి షాక్ ఇస్తోంది. సినిమా రీమేక్ అని తెలియగానే నార్త్ జనాలు ఒక్కసారిగా హిందీలో డబ్ అయిన ఆర్ఎక్స్ 100 ని చూసేశారు. 

యూ ట్యూబ్ లో సినిమాకు 13 మిలియన్ వ్యూవ్స్ వచ్చాయి అంటే ఎంతగా బాలీవుడ్ జనాలను సినిమా ఎట్రాక్ట్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే సినిమాను ఉన్నదీ ఉన్నట్టుగా కాకుండా డిఫరెంట్ గా తెరకెక్కించాలని దర్శకుడు నడియాడ్ వాలా ఆలోచిస్తున్నాడు. అయితే అలాంటి కథను ఏమాత్రం మార్చినా సినిమా స్క్రీన్ ప్లేలో తేడా కొట్టేస్తుందని టాక్ వస్తోంది. మరి చిత్ర యూనిట్ సక్సెస్ ఫుల్ కథను ఏ విధంగా తెరకెక్కిస్తుందో చూడాలి.